Finger 4 Area In Ladakh: లఢఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ( Line Of Actual Control ) వద్ద భారత్ చైనా మధ్య టెన్షన్ రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం పాంగోంగ్ సోలో ( Pangong Tso ) ఫింగర్ 4 ఏరియా ( Finger 4 Area ) నుంచి తగ్గనంటూ చైనా మొండి పట్టుపట్టడం. చైనా వైఖరిని గమనించిన ఇండియన్ ఆర్మీ ( Indian Army ) తూర్పు లఢఖ్‌లో ట్యాంకులను మోహరింపును అధికం చేసింది.  ( Twitter Hacked: ఒబామా, బిల్ గేట్స్ ట్విట్టర్ ఎకౌంట్స్ హ్యాక్ )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Rajnath Singh ) జూలై 17-18 తేదీల్లో లఢఖ్, జమ్మూ కశ్మీర్‌ను సందర్శించనున్నారు. నార్తెన్ కమాండ్ చీఫ్ లెఫ్టనెంట్ జెనరల్ వైకే జోషి ( YK Joshi ) ఇప్పటికే డిల్లీకి చేరనున్నారు. ప్రధాని మోదీని ( PM Modi ) త్వరలో కలవనున్నట్టు సమాచారం. వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 


చైనా దూకుడును గమనించిన ఇండియన్ ఆర్మీ సుమారు 60 వేల మంది సైనికులను తూర్పు లఢఖ్‌లో ( East Ladakh ) మోహరించింది. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడకుండా తీసుకోవాల్సిన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు చర్చలు మరో వైపు దూకుడు చూపుతున్న చైనాను నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే భారత సైన్యం ముందస్తుగానే సైన్యాన్ని సిద్ధంగా ఉంచుతోంది.


 Also read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ