India VS China: లడాఖ్‌లోని గాల్వన్ లోయలో కాల్పుల ఘటన అనంతరం ఇరు దేశాలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైనాతో మూడు దఫాలుగా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు ఫలించాయి. తమ ఆధీనంలో ఉన్న 10 మంది భారత సైనికులను చైనా విడుదల చేసింది. ఇందులో నలుగురు ఉన్నతాధికారులున్నట్లు జాతీయ మీడియా రిపోర్టు చేసింది. చైనా చెర నుంచి గురువారం సాయంత్రం జవాన్లు భారత్ శిబిరాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గాల్వన్ లోయ వివాదం.. చైనా కీలక ప్రకటన, మళ్లీ అగ్గి రాజేస్తోంది!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఐదున్నర దశాబ్దాలలో ఈ విధంగా భారత జవాన్లు, అధికారులు చైనాకు చిక్కటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరుదేశాల్లోనూ గాల్వన్ లోయ(Galwan Valley) ఘటనతో ఉద్రిక్తత నెలకొనటంతో భేటీ వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే మూడు దఫాలుగా జరిగిన చర్చల ఫలితంగా చైనా ఆధీనంలో ఉన్న 10 మంది భారత సైనికులు విడుదలయ్యారు. చైనా బలగాలతో ఘర్షణలో 20 మంది భారత సైనికుల వీర మరణం


కాగా, జూన్ 15న లఢాఖ్‌లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబు(Colonel Santosh Babu) సహా 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దాదాపు 70కి పైగా జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. మరోవైపు భారత జవాన్లు సైతం ప్రతిదాడి చేసి కొందరు చైనా జవాన్లను మట్టుబెట్టినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చైనా మాత్రం ఏ వివరాలు వెల్లడించడం లేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ