India vs China: గాల్వన్ లోయ వివాదం.. చైనా కీలక ప్రకటన, మళ్లీ అగ్గి రాజేస్తోంది!

Galwan Valley | గాల్వన్ లోయలో జరిగిన కాల్పుల ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులుకాగా, చైనా మాత్రం కుయుక్తులు ప్రదర్శిస్తోంది. మరో కీలక ప్రకటనతో అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తోంది. గాల్వన్ లోయ తమ ప్రాంతమేనంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Last Updated : Jun 17, 2020, 03:34 PM IST
India vs China: గాల్వన్ లోయ వివాదం.. చైనా కీలక ప్రకటన, మళ్లీ అగ్గి రాజేస్తోంది!

Galwan Valley Incident: చైనా మరోసారి కుయుక్తులు ప్రదర్శిస్తోంది. తూర్పు లడాఖ్‌లోని గాల్వన్ లోయలో మంగళవారం కాల్పులకు తెగబడటంతో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే గాల్వన్ లోయ తమ ప్రాంతమని, చైనాకు దానిపై పూర్తి అధికారం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించారు. India vs China: స్పందించిన ఇండియన్ ఆర్మీ

‘గాల్వన్ లోయ (Galwan Valley) చైనాకు చెందిన ప్రాంతం. మాకు దానిపై పూర్తి అధికారం ఉంది. భారత సైనికులు సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సరిహద్దు వెంబడి కదలికలు జరుపుతున్నారు. సరిహద్దు వెంబడి క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా మెలగాలని భారత్ బలగాలకు సూచిస్తున్నాం. కవ్వింపు చర్యలు పాల్పడటం ఇకనైనా మానుకోవాలంటూ’ చైనా ప్రతినిధి ఝావో లిజియన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైకోర్టుకు సమాధానం చెప్పలేకనే పెన్షన్ల కోతపై ఆర్డినెన్స్: TSUTF

ఏదైనా సమస్య ఉంటే భారత్, చైనా అధికారులతో చర్చలు జరపాలన్నారు. ఇందులో ఎవరి తప్పు ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. చైనా పరిధిలోని ఎల్‌ఏసీలోని ప్రాంతంలో కాల్పులు జరిగాయి, కనుక మా దేశాన్ని నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. చైనా ఇలాంటి కాల్పుల ఘటనలు మరిన్ని కోరుకోవడం లేదంటూ కాల్పులపై అస్పష్టమైన వివరాలు వెల్లడిస్తూ నక్క వినయాన్ని ప్రదర్శిస్తోంది. త్వరలో విచారణకు సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి

కాగా, గాల్వన్ లోయలో చైనా బలగాలు జరిప్పిన కాల్పులలో  20 మంది  భారత సైనికులు వీర మరణం పొందారు. అయితే చైనా సైనికులు సైతం భారీగానే చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై స్పందించేందుకు మాత్రం నిరాసక్తి చూపుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News