Hyderabad Floods: తెలంగాణకు ఢిల్లీ సాయం.. రూ.15 కోట్ల విరాళం ప్రకటించిన కేజ్రీవాల్
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంట వెంటనే వచ్చిన వరదలతో హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది.
Delhi govt donate Rs 15 cr to the Govt of Telangana: న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ( Hyderabad ) అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో.. రెండుసార్లు వెంటవెంటనే వచ్చిన వరదలతో (Rains and Flood) హైదరాబాద్ నగరం భారీగా నష్టపోయింది. ఈ జల ప్రళయం వల్ల నగరవాసుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) తక్షణ సాయం కింద సోమవారం రూ. 550 కోట్లను విడుదల చేశారు. అంతేకాకుండా వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని, సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్షాలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నడుంబిగించాయి. Also read: NEET 2020 Results: ‘నీట్’గా లేదు.. ఆలిండియా టాపర్ సైతం ఫెయిల్
తెలంగాణకు ఇప్పటికే తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం రూ. 10 కోట్లు విరాళం ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) సైతం విరాళం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునారావాస చర్యల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తమ రాష్ట్రం (Delhi ) తరుపున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు.. హైదరాబాద్ సోదరులు, సోదరీమణుల పక్షాన అండగా నిలుస్తారంటూ ఆయన ట్విట్ చేశారు. అయితే.. రూ.15 కోట్ల సాయం ప్రకటించిన కేజ్రీవాల్‌కు తెలంగాణ ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తమ ప్రజలకు అండగా నిలిచినందుకు కేసీఆర్ (KCR).. కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. Also read: Navratri Day 4: అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు
ఇదిలాఉంటే.. కేసీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముందుకు వచ్చారు. తమ రెండు నెలల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థ కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు 10 కోట్ల విరాళం ప్రకటించింది. Also read: Hyderabad floods: నేటి నుంచే వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe