Hyderabad floods: నేటి నుంచే వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం

Minister KTR review meeting on rescue operations in Hyderabad: హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు సూచించారు.

Last Updated : Oct 20, 2020, 01:28 PM IST
Hyderabad floods: నేటి నుంచే వరద బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం

Minister KTR review meeting on rescue operations in Hyderabad: హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు సూచించారు. వరద బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ ఆర్థిక సహాయాన్ని నేటి నుంచే పంపిణీ చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ తరపున ఈ ఆర్థిక సహాయం అందచేయనున్నట్టు మంత్రి తెలిపారు. 3-4 లక్షల కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల పర్యవేక్షణపై నేడు జీహెచ్ఎంసీ పరిధిలోని ( GHMC) ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌లతో కలిసి ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ సూచనలు చేశారు. Also read : Puranapool Bridge Cracks: పురానాపూల్‌ బ్రిడ్జి సురక్షితమే.. వాహనాలు రైట్ రైట్

Rs-10000-financial-assistance-to-flood-victims-in-hyderabad-floods

సమావేశంలో మంత్రి కేటీఆర్ చేసిన కీలక సూచనలు, నిర్ణయాలు..
రానున్న పది రోజుల పాటు నగర పరిధిలోని ప్రతీ ఒక్క ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలియ తిరుగుతూ అక్కడ బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ నేతలకు స్పష్టంచేశారు
Also read : CM KCR On Hyderabad Floods: వరదల వల్ల నష్టపోయిన ప్రతీ ఇంటికి రూ.10 వేలు

CM relief kit: వరదల వల్ల నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలని.. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందాలనేది ముఖ్యమంత్రి లక్ష్యం అని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రకటించిన సీఎం రిలీఫ్ కిట్‌తో పాటు వారి కోసం ప్రకటించిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Shelter camps in GHMC: జిహెచ్ఎంసి పరిధిలో మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన షెల్టర్ క్యాంపులను పరిశీలించి అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీచేశారు.

బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేలదేనని.. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు అండగా నిలవాలని మంత్రి తేల్చిచెప్పారు. Also read : CM relief kit: ఇంటివద్దకే సీఎం రిలీఫ్ కిట్: మంత్రి కేటీఆర్

Two months salaries donation to CM relief fund; ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 నెలల వేతనం:  
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిహెచ్ఎంసి పరిధిలోని నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందిచ్చేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News