NEET 2020 Results: ‘నీట్‌’గా లేదు.. ఆలిండియా టాపర్‌ సైతం ఫెయిల్‌

దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్-2020 పరీక్ష ఫలితాలు (NEET Result 2020) ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఫస్ట్ ర్యాంక్ ప్రకటన విషయంలో ఇప్పటికే ఎన్‌టీఏపై విమర్శలు వ్యక్తమవుతుండగా.. తాజాగా టాప్ ర్యాంకు సాధించిన అభ్యర్థిని ఫెయిల్ చేయడంపై ఆగ్రహం పెల్లుబికుతోంది.

Last Updated : Oct 20, 2020, 12:12 PM IST
NEET 2020 Results: ‘నీట్‌’గా లేదు.. ఆలిండియా టాపర్‌ సైతం ఫెయిల్‌

Major blunder in NEET 2020 exam results revealed: న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్-2020 పరీక్ష ఫలితాలు (NEET Result 2020) ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఫస్ట్ ర్యాంక్ ప్రకటన విషయంలో ఇప్పటికే ఎన్‌టీఏపై విమర్శలు వ్యక్తమవుతుండగా.. తాజాగా టాప్ ర్యాంకు సాధించిన అభ్యర్థిని ఫెయిల్ చేయడంపై ఆగ్రహం పెల్లుబికుతోంది. ఎన్‌టీఏ ప్రకటించిన నీట్ ఫలితాన్ని ఓ విద్యార్థి సవాల్ చేయగా.. ఓఎంఆర్ షీట్‌ను తనిఖీ చేసిన తర్వాత ఆ విద్యార్థి ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచినట్లు తేలింది. రాజస్తాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ పట్టణంలో నివసిస్తున్న 17 ఏళ్ల మృదుల్‌ రావత్‌ (Mridul Rawat) కు ఈ సమస్య ఎదురైంది. అక్టోబర్ 16 న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఏటీఏ) జారీ చేసిన మొదటి మార్క్‌షీట్‌ ప్రకారం రావత్ ఫెయిల్‌ అయినట్లు వచ్చింది. 720 మార్కులకు గాను రావత్‌కు 329 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో రావత్ తన ఫలితాన్ని సవాలు చేస్తూ ఎన్‌టీఏకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు రావత్ ఓఎంఆర్‌ షీట్‌, ఆన్సర్‌ కీని తిరిగి తనిఖీ చేయడంతో 650 మార్కులతో అతను ఎస్టీ కేటగిరీలో ఆల్‌ ఇండియా టాపర్‌ అని తేలింది. దీంతోపాటు రావత్ జనరల్ కేటగిరీలో ఆల్‌ ఇండియా 3577వ ర్యాంకు సాధించాడు. Also read: NEET 2020: సమాన మార్కులొచ్చినా ఒక్కరికే మొదటి ర్యాంకు

 అనంతరం ఎన్‌టీఏ జారీ చేసిన రెండవ మార్క్‌షీట్‌లో కూడా మరో పొరపాటును గుర్తించారు. రెండోసారి జారీ చేసిన మార్కుల షీట్‌లో అతని మార్కులు మొత్తం 650 అని చూపించినప్పటికి.. అక్షరాల్లో మాత్రం మూడు వందల ఇరవై తొమ్మిది (329) అని మాత్రమే రాసి ఎన్‌టీఏ అధికారులు జారీ చేశారు. అయితే నీట్ టాప్ ర్యాంకర్‌కు ఇలాంటి సమస్య ఎదురుకావడంపై అందరూ ఎన్‌టీఏపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. Also read: Navratri Day 4: అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు

ఇదిలాఉంటే.. ఇప్పటికే ఫస్ట్‌ ర్యాంకు విషయంలో కూడా ఎన్‌టీఏ (NTA) పై విమర్శలు తలెత్తుతున్నాయి. ఒడిశాకు చెందిన సోయబ్‌ అఫ్తాబ్ (Soyeb Aftab)‌, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్‌ (Akanksha Singh) ఇద్దరు 720/720 ఆవుట్‌ ఆఫ్‌ మార్కులు సాధించారు. కానీ ఎన్‌టీఏ టై బ్రేకింగ్‌ పాలసీ ప్రకారం అఫ్తాబ్‌కి మొదటి ర్యాంకు, ఆకాంక్షకు రెండవ ర్యాంకుగా ప్రకటించింది.  Also read: Haj 2021: ఆ తర్వాతే హజ్ యాత్రపై నిర్ణయం: కేంద్ర మంత్రి నఖ్వీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News