Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి ఆయన హాజరుకానున్నారు.  ఢిల్లీ పర్యటనలో  ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్​ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నారు. ప్రధానంగా డిసెంబర్​ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా  సెక్రటేరియట్​ ప్రాంగణంలో లక్ష మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనికోసం సోనియా, రాహుల్ గాంధీ​, ప్రియాంక వాద్రా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున​ ఖర్గేను  ముఖ్యమంత్రి రేవంత్ ​రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా  తెలంగాణలో ఖాళీగా ఉన్న ఆరు  మంత్రి పదవులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నాడు.  ఈ నేపథ్యంలో కేబినెట్ ‌ విస్తరణలో ఎవరెవరికీ అవకాశాలు దక్కబోతున్నాయనే దానిపై కూడా చర్చించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.  


మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి కేబినెట్‌ విస్తరణపై పడింది.అయితే.. మహారాష్ట్రలో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. వారి నమ్మకం పెట్టుకున్న మైనారిటీ ఓట్లు పోలరైజ్ అయినా.. మెజారిటీ ప్రజల ఓట్లు బీజేపీ కూటమి వైపు పోలరైజ్ కావడం కాంగ్రెస్ ను చావు దెబ్బ తీసింది. ‘బటేంగేతో ఖటేంగే’ అన్న యోగి నినాదంతో పాటు ‘ఏక్ హై తో సేఫ్ హై’ అన్న నినాదాం బాగానే పనిచేసి మహాయుతి కూటమికి మంచి విజయం సాధించి పెట్టాయి.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter