కాంగ్రెస్ పార్టీ తమ షరతులను అంగీకరించిందని పాటీదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ బుధవారం స్పష్టం చేశారు. సెక్షన్ 31, సెక్షన్ 46 కింద పాటీదార్లకు రిజర్వేషన్ ఇచ్చేందుకు, బీసీలో చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు హార్దిక్ పటేల్ మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక పాటీదార్లకు రిజర్వేషన్ల కొరకు బిల్లు తీసుకొస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాము టికెట్లు అడగలేదని అన్నారు. పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్)కు, కాంగ్రెస్ కు మధ్య ఎటువంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేసారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని తాము ఎవరినీ  కోరలేదని.. అది ప్రజలకే వదిలేస్తున్నామని చెప్పారు.


గుజరాత్ ఎన్నికల్లో తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతామని మరోసారి హార్దిక్ స్పష్టం చేశారు. గుజరాత్ లో కొన్నిచోట్ల మా ఉద్యమకారులను బీజేపీ పలుమార్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని.. రూ.50 లక్షలు ఆఫర్ చేసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టో లో పాటీదార్ల రిజర్వేషన్ ను చేర్చాల్సిఉందని పేర్కొన్నారు.