Priyanka Gandhi Vadra: ఎంపీగా ప్రియాంక ప్రమాణ స్వీకారం.. ఎంట్రీ రోజే.. లోక్ సభలో రచ్చ రచ్చ..
Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా నేడు పార్లమెంట్ కు దిగువ సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాదు ఎంట్రీ రోజే లోక్ సభల పలు అంశాలపై రచ్చ జరిగింది.
Priyanka Gandhi Vadra: రాహుల్ గాంధీ.. గత ఎన్నికల్లో వయనాడ్ తో పాటు ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి ఎంపీగా పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన రాహుల్ గాంధీ.. ఒక సీటును ఒదులుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వయనాడ్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామాతో ఈ లోక్ సభ సీటకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక వాద్రా గాంధీ కాంగ్రెస్ పార్టీ తరుపు ఎంపీగా పోటీ చేసి 4 లక్షలకు పైగా రికార్డు మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి.
లోక్ సభ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రియాంక గాంధీ.. ఈ రోజు లోక్ సభకు హాజరయ్యారు. కేరళ సంప్రదాయ ‘కసావు’ చీరకట్టులో హాజరయ్యారు. అంతేకాదు చేతిలో రాజ్యాంగ ప్రతిని చేతమూని ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు. అంతేకాదు వయనాడ్ లో విజయ కేతనం ఎగరేసిన నేపథ్యంలో నెహ్రూ- గాంధీ ఫ్యామిలీలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన మూడో వ్యక్తిగా ప్రియాంక రికార్డు క్రియేట్ చేసారు. అప్పట్లో ఇందిరా గాంధీ మెదక్ స్థానం నుంచి గెలుపొందారు. అటు రాహుల్ గాంధీ గత పర్యాయం వయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అటు సోనియా గాంధీ.. కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి సక్సెస్ సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె అమేఠీ పార్లమెంట్ స్థానాన్ని గెలిచిన తర్వాత ఈ స్థానాన్ని ఒదులుకున్నారు.
ప్రెజెంట్ సోనియా గాంధీ.. రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. రాహుల్ రాయ్ బరేలి నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ నుంచి గెలుపొంది లోక్ సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆమె ప్రమాణ స్వీకారం తర్వాత లోక్ సభ రచ్చ రచ్చ నడించింది. ప్రియాంక వాద్రాతో పాటు నాందేడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావ్ చవాన్ ప్రమాణ చేశారు.
మరోవైపు వయనాడ్ ఓటర్లు తమకు మద్దతు ఇచ్చినందుకు తన అభినందనలను తెలియజేశారు ప్రియాంక వాద్రా. వారి నమ్మకానికి తాను ఎనలేని కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్లమెంట్‌లో సమర్ధవంతంగా ప్రాతినిధ్యం వహిస్తానన్నారు. వయనాడ్ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు ప్రియాంక.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter