Corona Virus: ఆ భారతీయులకు కరోనా సోకదు
కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తోంది. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఆ 15 శాతం జనాభా ( 15 percent of Population ) కు మాత్రం కరోనా సోకదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఇండియాలో కరోనా సోకని ఆ జనం ఎవరు?
కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తోంది. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఆ 15 శాతం జనాభా ( 15 percent of Population ) కు మాత్రం కరోనా సోకదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఇండియాలో కరోనా సోకని ఆ జనం ఎవరు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా..ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాల్సి ఉండటంతో ఆ దిశగా అన్ని ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్ 19 వైరస్ కు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ ) ( ICMR ) ఆర్ టీ-పీసీఆర్ ( RT-PCR ), యాంటీజెన్ పరీక్ష ( Antigen Tests ) లకు అనుమతిచ్చింది. ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని ప్రైవేట్ ల్యాబొరేటరీలు కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రదానమైంది థైరోకేర్ ( Thyrocare ) . ఈ ల్యాబ్ వెల్లడించిన ఫలితాలు చాలా ఆసక్తి రేపుతున్నాయి.
ఆ 18 కోట్ల మందికి కరోనా సోకదు:
థైరోకేర్ సంస్థ (Thyrocare ) వెల్లడించిన ఫలితాల్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. భారతీయుల్లోని ఆ 15 శాతం మందికి కరోనా సోకే అవకాశం లేదని సంస్థ ఫలితాలు చెబుతున్నాయి. ఏకంగా 60 వేల మంది ఫలితాల్ని విశ్లేషించి చెబుతున్న విషయమిది. భారతీయుల్లో ముఖ్యంగా 18 కోట్లమందిలో రోగ నిరోధక శక్తి అత్యధికంగా ఉన్న కారణంగా వారికి కరోనా సోకదని థైరో కోర్ అంచనా వేస్తుంది. వారి శరీరాల్లో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉండవచ్చని..అదే దీనికి కారణమని తెలుస్తోంది. దేశంలోని 6 వందల ప్రాంతాల్లో 60 వేల మందిపై దాదాపు 20 రోజుల పాటు నిర్వహించిన యాంటీబాడీ పరీక్షల ఫలితాల్ని విశ్లేషించి థైరోకేర్ ఈ అబిప్రాయానికి వచ్చింది. Also read: Corona Symptoms: కోవిడ్19 వైరస్ అదనపు లక్షణాలివే
థైరోకేర్ వెలువరించిన డేటా ప్రకారం యాంటీబాడీల్ని అభివృద్ధి చేసుకున్న జాబితాలో థానే ( Thane )లోని బివాండీ ప్రాంతం టాప్ లో ఉంది. తరువాత స్థానంలో బెంగుళూరు ( Bengaluru ) లోని పీన్యా ఉంది. ప్రపంచ దేశాల్లో ప్రతి 5 వందల మందికి ఒక్కరు కరోనా కారణంగా చనిపోతుంటే...భారత్ ( India ) లో మాత్రం ప్రతి పదివేలమందికి ఒక్కరు చనిపోతున్నట్టు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వెలుమని ట్విట్టర్ లో స్పష్టం చేశారు.
ప్రపంచంలోని ఇతర దేశీయులతో పోలిస్తే భారతీయుల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉందనే విషయం ఇప్పటికే చాలా సంస్థలు ధృవీకరించాయి. ఇప్పుడు థైరోకేర్ విశ్లేషణ నిజంగానే భారతీయులకు ఊపిరి పీల్చుకునే అంశంగా ఉంది. Also read: Corona virus: అతడికి మళ్లీ పాజిటివ్