India Covid 19 cases Update: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 11607 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరగడం కాస్త ఆందోళన కలిగించే విషయం. అయితే నిన్నటితో పోలిస్తే మరణాల సంఖ్య భారీగానే తగ్గింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న (ఫిబ్రవరి 2) దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 1733 మరణాలు సంభవించగా.. గడిచిన 24 గంటల్లో 1008 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,18,03,318కి చేరింది. ఇప్పటివరకూ 4,98,983 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,33,921 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


 గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ (Covid 19 Cases) రికవరీల సంఖ్య 2,59,107గా నమోదైంది. దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం రికవరీల సంఖ్య 3,97,70,414కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 95.14 శాతంగా ఉంది. నిన్న 9.26 శాతంగా ఉన్న డైలీ పాజిటివిటీ రేటు గడిచిన 24 గంటల్లో 10.99 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 12.98 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కర్ణాటకలో 20,505 కేసులు, తమిళనాడులో 14,013 కేసులు, ఢిల్లీలో 3028 కేసులు, బెంగాల్‌లో 2723 కేసులు నమోదయ్యాయి.



Also Read: MS Dhoni Atharva: మైథలాజికల్ సూపర్ హీరోగా ధోనీ.. కొత్త అవతార్‌లో అదుర్స్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook