Covid Cases Today: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా 18 వేల మార్క్ దాటుతున్న కరోనా కేసులు గత రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయం. సోమవారం (జూలై 11) దేశవ్యాప్తంగా 16,680 కేసులు నమోదవగా గడిచిన 24 గంటల్లో ఆ సంఖ్య 13,615కి తగ్గింది. నిన్నటితో పోలిస్తే 3063 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో మరో 20 మంది మృతి చెందారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,96,427కి చేరింది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,25,474కి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో గడిచిన 24 గంటల్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 0.30 శాతం మేర పెరిగింది. కరోనా కేసుల సంఖ్య నిన్న 1,30,713గా ఉండగా ఇవాళ 1,31,043కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.50గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.23 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.24 శాతంగా ఉంది. ఇప్పటివరకూ దేశంలో 199 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.


ప్రపంచవ్యాప్తంగా 2020లో మొదలైన  కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య డిసెంబర్, 2020లో కోటి మార్క్‌ను దాటింది. గతేడాది జూన్‌లో మూడు కోట్ల మార్క్‌ని చేరగా.. ఈ ఏడాది జనవరిలో 4 కోట్ల మార్క్‌ను దాటింది. 



 


Also Read: SI Physical Abuse: మరో ఖాకీ కీచకపర్వం.. ఆసిఫాబాద్ జిల్లాలో యువతికి ఎస్సై లైంగిక వేధింపులు..   


Also Read:Ashu Reddy: బీచ్ సైడ్ పార్టీలో పొట్టి బట్టల్లో అషు రెడ్డి రచ్చ.. నెవర్ బిఫోర్ అనేలా!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook