Criminal case on Karnataka Ex CM yaddurappa: బీజేపీ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. యడ్డీపై నమోదు అయిన భూ ఆరోపణలపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు సమన్లు సైతం జారీ చేసింది. భూసంబంధిత డీ నోటిఫికేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని యడ్యూరప్పపై ఆరోపణలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని.. విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు లోకాయుక్త పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి క్రిమినల్‌ కేసులపై విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. 


మరోవైపు యడ్యూరప్పపై 2013లోనే ఈ ఫిర్యాదు నమోదు అయ్యింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనూ అవినీతి జరిగిందని.. వాసుదేవరెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరు ఐటీ కారిడార్‌ స్థలం విషయంలో భూఅక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. డీనోటిఫికేషన్‌ తర్వాత ఆ స్థలాలను పలువురు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారు. ఈక్రమంలోనే అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం 1988 కింద..మాజీ సీఎం యడ్యూరప్పపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. తన ముందు హాజరు కావాలని నోటీసుల్లో ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది.


ఇటీవల బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం పదవి నుంచి యడ్యూరప్ప తప్పుకున్నారు. వయసు మీద పడటంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు నాయకత్వ మార్పిడి జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే!


Also read: Bengaluru Rape: బెంగళూరులో దారుణం... నర్సుపై నలుగురు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ గ్యాంగ్ రేప్...


Also read: కేజ్రీవాల్ నివాసంపై దాడి... హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ సంచలన ఆరోపణ...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook