COVID-19: త్వరలో మార్కెట్లోకి సిప్లా Favipiravir
కరోనావైరస్ చికిత్సలో ఉపయోగించే కీలక ఔషధం.. ఫవిపిరవిర్ (Favipiravir) ను ముంబైకి చెందిన ఫార్మా సంస్థ సిప్లా (Cipla) త్వరలోకి మార్కెట్‌లోకి తీసుకురానుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( CSIR) పేర్కొంది.
Corona Drug Favipiravir: ఢిల్లీ : కరోనావైరస్ ( Coronavirus ) చికిత్సలో ఉపయోగించే కీలక ఔషధం.. ఫవిపిరవిర్ ( Favipiravir ) ను ముంబైకి చెందిన ఫార్మా సంస్థ సిప్లా ( Cipla ) త్వరలోకి మార్కెట్‌లోకి తీసుకురానుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( CSIR ) పేర్కొంది. వాస్తవానికి తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎస్‌ఐఆర్ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. స్ధానిక కెమికల్స్‌తో ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసిన సీఎస్‌ఐఆర్ ఆ తర్వాత దీని సాంకేతికతను సిప్లాకు బదలాయించింది. Also read: Oxford Vaccine: ఇండియాలో మూడవ ఫేజ్ వ్యాక్సిన్ ట్రయల్స్
అయితే.. ఈ మందు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉందని గురువారం సీఎస్ఐఆర్ అధికారికంగా తెలిపింది. ఈ మేరకు సీఎస్‌ఐఆర్-ఐఐసీఆర్ డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్ దినిపై మాట్లాడుతూ.. తాము అభివృద్ధి చేసిన ఔషధం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. తక్కువ వ్యవధిలోనే డ్రగ్ తయారీదారులు పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు ఈ ఔషధం అనువైనదని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ బారినపడి స్వల్ప, మధ్యస్థ లక్షణాతో ఉండే రోగుల చికిత్సలో ఫవిపిరవిర్ మంచి ఫలితాలను అందిస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఇది క్లినికల్ ట్రయల్స్‌లో కూడా మంచి ఫలితాలను కనబర్చింది. Also read: India: 30 వేలు దాటిన కరోనా మరణాలు
అయితే సిప్లా సంస్థ... ఈ ఔషధం ఫవిపిరవిర్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు అనుమతుల కోసం డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ( DCGI )ను సంప్రదించింది. అంతకు ముందు డీసీజీఐ ఫవిపిరవిర్‌ను కరోనా అత్యవసర చికిత్సలో ఉపయోగించవచ్చని అదేశాలు ఇచ్చింది. కావున కోవిడ్ రోగులకు సాయమందించడానికి ఈ ఔషధం ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిప్లా వెల్లడించింది. Also read: Corona patients: చిందేసిన కరోనా బాధితులు