ముంచుకొస్తున్న `ఎంఫాన్` తుపాన్..!!
`ఎంఫాన్` తుపాన్ ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంఫాన్ తుపాన్ బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుపానుగా పరిణమించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
'ఎంఫాన్' తుపాన్ ముంచుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంఫాన్ తుపాన్ బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుపానుగా పరిణమించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది శనివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అంతే కాదు ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారి తుపాన్ గా పరిణమిస్తుందని తెలిపింది. ఈ తుఫాన్ కు ఎంఫాన్ తుపాన్ గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాన్ ప్రతి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల మేర కదులుతోందని వెల్లడించారు. ఒడిశాలో పారాదీప్ కు 11 వందల కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది.
అలాగే ప్రస్తుతం సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి ఉందని IMD తెలిపింది. అందుకే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు ఎవరైనా సముద్రంలోఉంటే రేపటిలోగా తీరానికి చేరుకోవాలని సూచించారు.
ఎంఫాన్ తుపాన్ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో రేపటి నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని ఐఎండీ సూచించింది. మే 19, 20 తేదీల్లోనూ భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది.
మొత్తంగా ఎంఫాన్ తుపాన్ 8 రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తుందని ఐఎండీ తెలిపింది. ఇందుకోసమే 8 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..