MLAs With Oxygen Cylinders: ఆక్సీజన్ సిలిండర్లు తగిలించుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
BJP MLAs With Oxygen Cylinders: బీజేపి నేతలు సెక్యురిటీని దాటుకుని అసెంబ్లీలోకి ఆక్సీజన్ సిలిండర్లతో రావడాన్ని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీ ఆవరణలో భద్రతా నియామలను ఉల్లంఘించినందుకు వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రతా సిబ్బంది సైతం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీచేశారు.
BJP MLAs With Oxygen Cylinders: ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రత పెరిగి జనాలకు ఊపిరి ఆడటం లేదని.. ఎంతోమంది రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ ఢిల్లీ బీజేపి ఎమ్మెల్యేలు ఆక్సీజన్ సిలిండర్లు చేతపట్టుకుని, ఆక్సీజన్ మాస్కులతో అసెంబ్లీకి వచ్చారు. గాలి కాలుష్యంతో ఊపిరాడక వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితిని తెలియజెప్పేందుకు తాము ఈ విధమైన నిరసన చేపట్టినట్టు ఢిల్లీ బీజేపి ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు.
నేటి సోమవారం నుండి మూడు రోజుల పాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో గాలి కాలుష్యంపై బీజేపి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత, బీజేపి శాసనసభా పక్ష నేత అయిన విజేందర్ గుప్తా నేతృత్వంలో ఈ ఆందోళన చేపట్టారు. విజేందర్ గుప్తాతో పాటు రామ్ విర్ సింగ్ బిద్గురి, ఓపి శర్మ, అభయ్ వర్మ ఆక్సీజన్ సిలిండర్లు, ఆక్సీజన్ మాస్కులతో తమ నిరసన గళం వినిపించారు.
ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని నివారించడానికి ఆప్ సర్కారు ఏం చర్యలు చేపట్టిందో ఢిల్లీ ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా విజేందర్ గుప్తా డిమాండ్ చేశారు. ఢిల్లిలీ ఉన్న 2 కోట్ల మంది ప్రజల తరపున తాము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని.. ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపి నేతలు పట్టుబట్టారు.
ఇదిలావుంటే, బీజేపి నేతలు సెక్యురిటీని దాటుకుని అసెంబ్లీలోకి ఆక్సీజన్ సిలిండర్లతో రావడాన్ని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారిని ఆక్సీజన్ సిలిండర్లు పక్కన పెట్టాల్సిందిగా ఆదేశించిన స్పీకర్ రామ్ నివాస్ గోయెల్.. అసెంబ్లీ ఆవరణలో భద్రతా నియామలను ఉల్లంఘించినందుకు వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రతా సిబ్బంది సైతం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. మొత్తానికి బీజేపి ఎమ్మెల్యేల నిరసనతో నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఢిల్లీ కాలుష్యరహిత నగరంగా మార్చాల్సిందిగా నినాదాలు చేసిన బీజేపి ఎమ్మెల్యేలు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను హోరెత్తించారు.
ఇది కూడా చదవండి : Viral Video: ఎంపీ సుప్రియ సూలే చీరకు మంటలు.. వీడియో వైరల్
ఇది కూడా చదవండి : Govt Employees Basic Salary: ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్ 2023 తరువాత సూపర్ గుడ్ న్యూస్ ?
ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook