NCP MP Supriya Sule's Saree Catches Fire: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే చీరకు మంటలంటుకున్న ఘటన కలకలం సృష్టించింది. కరాటే పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సుప్రియ సూలె జ్యోతి ప్రజ్వలన చేసే సమయంలో ప్రమాదవశాత్తుగా ఆమె చీరకు నిప్పంటుకుంది. అయితే సకాలంలో స్పందించడంతో మంటలు ఆర్పివేయడం సులభమైంది. లేదంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉండేదో ఉహించడం కూడా కష్టమే. సుప్రియ సులే చీరకు మంటలు అంటుకున్నాయని తెలియడంతో ఆమె అభిమానులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.
మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఫోన్లు చేసి పరామర్శిస్తుండటంతో ఈ ఘటనపై స్వయంగా సుప్రియ సూలే ట్విటర్ ద్వారా స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రేయోభిలాషులు, పౌరులు, పార్టీ కార్యకర్తలు అందరికీ ఆమె ట్విటర్ ద్వారా సందేశం ఇచ్చారు. మరోవైపు శివసేన పార్టీకి చెందిన నాయకురాలు శిల్పా బోడ్కె ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసుకున్నారు.
खासदार @supriya_sule ताई पुण्यात एका कार्यक्रमांमध्ये दीप प्रज्वलन करत असताना त्यांच्या साडीला लागली आग... pic.twitter.com/C6FBQici2A
— Shilpa Bodkhe - प्रा.शिल्पा बोडखे (@BodkheShilpa) January 15, 2023
బారామతి లోక్ సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సుప్రియ సూలె.. హింజావాడిలో కరాటే పోటీలను ప్రారంభించడానికి వెళ్లారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేస్తుండగా అక్కడే ఉన్న హారతి మంట అంటుకుని ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. సుప్రియ సూలే చీరకు మంటలు అంటుకోవడం.. వెంటనే ఆమే స్వయంగా స్పందించి మంటలు ఆర్పేసుకోవడం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : Govt Employees Basic Salary: ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్ 2023 తరువాత సూపర్ గుడ్ న్యూస్ ?
ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?
ఇది కూడా చదవండి : 2023 Maruti Suzuki Jimny: మారుతి సుజుకి నుంచి జిమ్నీ5 డోర్.. ఆ రెండు కంపెనీల ఎస్‌యూవీలకు పోటీ తప్పదా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook