New Vaccination Campaign: కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు, ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు ఈ విధానం ప్రవేశపెట్టామంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్త్తంగా కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రారంభించినా అంత వేగంగా కొనసాగడం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. రాజధానిలో 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఎక్కడ ఓటు వేశారో అక్కడే వ్యాక్సినేషన్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయడమే తమ లక్ష్యమని అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) తెలిపారు. ఢిల్లీలో 45 ఏళ్లు పైబడినవారు 57 లక్షల మంది ఉండగా..అందులో 27 లక్షల మందికి మొదటి డోసు పూర్తయింది. మిగిలిన 30 లక్షల మందిపై ఇప్పుడు దృష్టి సారించారు.


ఎక్కడ ఓటు వేశారో అక్కడే వ్యాక్సినేషన్ పథకంలో భాగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.ఢిల్లీలోని 70 వార్డుల్లో ఈ డ్రైవ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 272 వార్డులుండగా..వార్డులు లేని రెండు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అందుకే వారానికి 70 వార్డుల చొప్పున నాలుగు వారాల్లో డ్రైవ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల సౌలభ్యం కోసం ఈ రిక్షాల్ని ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ తీసుకునేవారిని ఈ రిక్షాలో వ్యాక్సినేషన్ (Vaccination) కేంద్రం వరకూ తీసుకెళ్తారు. బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తారు. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ అందిందా లేదా అనేది తెలుసుకుంటారు. వేయించుకోనివారికి ఏర్పాట్లు చేయడం, నిరాకరిస్తే ఒప్పించడం వంటి కార్యక్రమాలుంటాయి.


Also read: Black fungus cases: దేశంలో 28,252 బ్లాక్ ఫంగస్ కేసులు.. ఆ 2 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook