Delhi Covid Cases: దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, కేరళల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఒకేరోజులో 1000 కొత్త కేసులు నమోదవడంతో ఫోర్త్ వేవ్ భయాలు మొదలయ్యాయి. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ కొత్త వేరియంట్సే కారణమనే వాదన వినిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్‌లో 8 వేర్వేరు వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఒక వేరియంట్ మిగతా వాటి కన్నా వేగంగా వ్యాప్తి చెందే స్వభావాన్ని కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS) డైరెక్టర్ డా.ఎస్‌కే సరిన్ దీనిపై మాట్లాడుతూ... ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్స్ పుట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఐఎల్‌బీఎస్ ల్యాబ్‌లో ఢిల్లీలో కొత్తగా నమోదైన పలు కరోనా కేసుల శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కరోనా కొత్త వేరియంట్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.


కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డా.సరిన్ అన్నారు. చిన్నారుల్లో వ్యాక్సినేషన్ పూర్తి కాని నేపథ్యంలో... పిల్లలు కొత్త వేరియంట్స్ బారినపడేందుకు ఎక్కువ అవకాశం ఉండొచ్చుననే భయాలు వెంటాడుతున్నాయన్నారు.
 
ఢిల్లీలో నమోదవుతున్న కొత్త కేసుల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BA2.12.1ని గుర్తించినట్లు చెబుతున్నారు. ఇది ఒమిక్రాన్ BA.2కి సబ్ వేరియంట్‌గా చెబుతున్నారు. ఢిల్లీలో కేసుల పెరుగుదలకు కొత్త వేరియంటే కారణమని అనుమానిస్తున్నారు. బెంగళూరులోనూ BA.2 సబ్ వేరియంట్స్ BA.2.10, BA.2.12 రెండు కేసుల్లో బయటపడటం కలకలం రేపుతోంది. 


Also Read: Gang Rape: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం... యువతిని 30 గం. పాటు బంధించి గ్యాంగ్ రేప్...


Also Read: India Covid Cases: మరోసారి పెరిగిన కరోనా కేసులు.. భయాందోళనలో ఢిల్లీ వాసులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.