ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ టెస్టులలో ఆయనకు నెగటివ్ (Manish Sisodia Tests  negative for COVID19)‌గా తేలింది. కోవిడ్19 బారి నుంచి కోలుకున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. 



దాదాపు రెండు వారాల కిందట ఢిల్లీ (Delhi) డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కరోనా బారిన పడ్డారు. సెప్టెంబర్ 14న తనకు కరోనా సోకినట్లు వెల్లడించిన ఆప్ నేత, తొలుత ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అయితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడం, డెంగీ జ్వరం కూడా రావడంతో లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. 



కాగా, రక్తకణాల సంఖ్య పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా 2 వారాల తర్వాత మనీశ్ సిసోడియా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన కోవిడ్19 టెస్టులలో నెగటివ్ రావడంతో వైద్యులు ఆయనను డిశ్ఛార్జ్ చేశారు. అయితే వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఢిల్లీలో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండో దశ వ్యాప్తి మొదలైందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం వ్యాఖ్యానించారు. జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ ప్రజలను హెచ్చరించారు. 




 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe