Delhi Bus Scam: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ కొనుగోలు చేసిన 1000 బస్సులకు సంబంధించి అవినీతి అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై సీబీఐ విచారణకు ఫిర్యాదును పంపేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా గ్రీన్ ఆమోదం తెలిపారు.ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఏడాది జూన్‌లో గవర్నర్ సక్సేనాకు ఫిర్యాదు అందింది. బస్సుల కొనుగోలుకై నియమించిన కమిటీకి రవాణా శాఖ మంత్రిని ఛైర్మన్‌గా నియమించడం,  బిడ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా డీఐఎంటీఎస్ (ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్)కు బాధ్యతలు అప్పగించడం వెనక అవినీతి కుట్ర దాగుందని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లెఫ్టినెంట్ గవర్నర్ తనకు అందిన ఫిర్యాదును ఈ ఏడాది జూలై 22న ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి పంపించారు. ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి వివరణ కోరారు. దీనిపై ఆగస్టు 12న చీఫ్ సెక్రటరీ గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. ఈ వ్యవహారంపై  విచారణ జరిపిన కమిటీ బస్సుల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతున్నందునా.. గవర్నర్ తాజా ప్రతిపాదనను దీనికి జతచేయనుంది.


అసలేంటీ స్కామ్ :


జూలై, 2019లో 1000 బీఎస్ 4, బీఎస్ 5 వాహనాల కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ బిడ్ నిర్వహించింది. మార్చి 2020లో దీనికి సంబంధించి మరో బిడ్ నిర్వహించారు. మొత్తం 1250 బస్సుల కొనుగోలు, మెయింటెనెన్స్ కోసం రూ.4265 కోట్ల కాంట్రాక్ట్‌ను నిర్ణయించారు. ఆ తర్వాత 1000 బస్సులే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. బస్సుల కొనుగోలు కోసం రూ.850 కోట్ల కాంట్రాక్ట్‌ను, జేబీఎం, టాటా మోటార్స్‌ సంస్థలకు 70:30 నిష్పత్తిలో కేటాయించారు. ఇక ఏఎంసీ (వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్) బిడ్‌ను కూడా రూ.3500 కోట్లకు ఇవే సంస్థలకు కేటాయించారు.  ఇక్కడ బస్సుల కొనుగోలు కన్నా వాటి మెయింటెనెన్స్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ మొత్తం  వ్యవహారంలో తీవ్ర అవినీతి, అవకతకవలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఈ కేసులో సీబీఐ ఎంట్రీ  ఇచ్చింది. మరోవైపు ఆమ్ ఆద్మీ సర్కార్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆప్ సర్కార్ ఆరోపిస్తోంది.


Also Read: Krishnam Raju Death Live Updates: కృష్ణంరాజు కన్నుమూత.. రేపు అంత్యక్రియలు -లైవ్ అప్డేట్స్ 


Also Read: TATA EV Cars: టాటా నుంచి చీపెస్ట్ ఈవీ కారు వచ్చేస్తోంది.. అన్నింటి కన్నా ఇదే చీప్..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook