దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ విధించడం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారిపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారికి ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ, తెలంగాణ నుంచి ఏ మార్గంలోనైనా సరే ఢిల్లీకి చేరుకున్న వ్యక్తులను రెండు వారాలపాటు(14 రోజులు) ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు లేదా ప్రయాణానికి గరిష్టంగా 72 గంటలలోపు నిర్వహించిన ఆర్‌టీ-పీసీఆర్ (RT-PCR) కరోనా టెస్టుల రిపోర్టును వెంట తీసుకురావాలి. ఈ తరహా వ్యక్తులు సైతం 7 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌(Home Quarantine)లో ఉండాలని సూచించారు. తాము కోవిడ్19 వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నామని తెలిపేందుకు సంబంధిత సర్టిఫికేట్ సమర్పించాలి. 


Also Read: RT-PCR Tests: ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు వీరికి చేయకూడదు, ICMR తాజా మార్గదర్శకాలు విడుదల


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్లు గుర్తించినట్లు రిపోర్టులు వచ్చాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(DDMA) తమ ఉత్తర్వులలో పేర్కొంది. ఆ కొత్త రకం కోవిడ్19 వైరస్ వేరియంట్ తక్కువ సమయంలో భారీ సంఖ్యలో వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ అథారిటీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు, ఇతరత్రా వాహనాలలో ఢిల్లీకి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా కోవిడ్19 నిబంధనలు పాటించడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Also Read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న నిపుణులు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook