RT-PCR Tests: ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు వీరికి చేయకూడదు, ICMR తాజా మార్గదర్శకాలు విడుదల

ICMR Guidelines RT-PCR Tests:  ఇటీవలి కాలంలో ఆర్‌టీ-పీసీఆర్(RT-PCR) టెస్టులు అధికంగా పెరిగిపోయాయని, దాని వల్ల ల్యాబోరేటరీలపై పని భారం పెరిగిందని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజాగా మరికొన్ని సూచనలు చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : May 6, 2021, 04:08 PM IST
RT-PCR Tests: ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు వీరికి చేయకూడదు, ICMR తాజా మార్గదర్శకాలు విడుదల

RT-PCR Tests: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజాగా మరికొన్ని సూచనలు చేసింది. ఇటీవలి కాలంలో ఆర్‌టీ-పీసీఆర్(RT-PCR) టెస్టులు అధికంగా పెరిగిపోయాయని, దాని వల్ల ల్యాబోరేటరీలపై పని భారం పెరిగిందని ఐసీఎంఆర్ పేర్కొంది. కనుక ఏ సమయంలో ఆర్‌టీ-పీసీఆర్(RT-PCR) టెస్టులు నిర్వహించాలన్న దానిపై ఐసీఎంఆర్ అధికారులు తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 2,506 లాబోరేటరీలు ఐసీఎంఆర్ ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున  కోవిడ్19 టెస్టుల సంఖ్య పెంచాలని, కిట్లు కొరత అంటూ సైతం అక్కడక్కడా వినిపిస్తుంటుంది. అయితే కరోనా టెస్టులు అధికంగా చేస్తూ ల్యాబోరేటరి సిబ్బందికి పనిభారం పెంచడం, అవసరం లేని పేషెంట్లకు సైతం ఇలాంటి టెస్టులు నిర్వహిస్తున్నారని, కనుక తాము సూచించిన ప్రకారం కొన్ని కేసులలోల మాత్రమే ఆర్‌టీ-పీసీఆర్(RT-PCR) టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది. పలు రాష్ట్రాల్లో ప్రతిరోజూ దాదాపు లక్ష వరకు టెస్టులు నిర్వహిస్తూ ట్రేసింగ్‌లో దూకుడు కొనసాగిస్తున్నారు తద్వారా వెంటనే బాధితులకు చికిత్స ప్రారంభిస్తే కరోనా(COVID-19) నుంచి వారిని కాపాడవచ్చు అనేది దాని ముఖ్య ఉద్దేశం.

Also Read: Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదు, ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలన్న నిపుణులు

కింది తెలిపిన సందర్భాలలో RT-PCR టెస్టులు నిర్వహించకూడదు..
- ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా అంతరాష్ట్ర (రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి) ప్రయాణం చేస్తే వారికి RT-PCR టెస్టులు నిర్వహించకూడదని ఐసీఎంఆర్ పేర్కొంది

- 10 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి, గత మూడు రోజులుగా జ్వరం లేని వారికి ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయకూడదు

- ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (Rapid Antigen Test)లో పాజిటివ్‌గా తేలిన కరోనా వైరస్(CoronaVirus) బాధితులకు ఆర్‌టీపీసీఆర్ టెస్టు నిర్వహించరాదు

- ఇదివరకే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి ఆర్‌టీ-పీసీఆర్(RT-PCR) టెస్టు నిర్వహించకూడదని ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాలలో సూచించింది 

- కరోనా నుంచి కోలుకుని, ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి ఇంటికి వెళ్లనున్న వ్యక్తులకు ఆర్‌టీ-పీసీఆర్ (RT-PCR) చేయకూడదు.

Also Read: COVID-19 Patientsకు సీటీ స్కాన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు, AIIMS డైరెక్టర్

RT-PCR టెస్టులు ఎవరికి నిర్వహిస్తారంటే..
ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్( RAT)లో కోవిడ్19 నెగెటివ్‌గా తేలినా, కరోనా లక్షణాలు కనిపిస్తున్న వారికి ఆర్‌టీపీసీఆర్ కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్ గతంలోనే సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News