Delhi Borders: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఢిల్లీని అట్టుడికించింది. గణతంత్ర దినోత్సవాల నాడు జరిగిన ఉద్రిక్తత నేపధ్యంలో..ఢిల్లీ ఇప్పుడు శత్రుదుర్బేధ్యంగా మారుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నూతన రైతు చట్టాల ( New farm laws )కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ( Farmers protest ) కొనసాగుతోంది. దేశ గణతంత్ర దినోత్సవం నాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారి తీసింది. పోలీసు బ్యారికేడ్లను ధ్వంసం చేయడం, ఎర్రకోట ( Red fort ) ను ముట్టడించి మరీ త్రివర్ణపతాకం పక్కనే ఖల్సా జెండా ఎగురవేయడం దేశాన్ని కలవరపర్చింది. త్రివర్ణపతాకాన్ని అవమానానికి లోనైందంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra modi ) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశ రాజధాని రక్షణపై ప్రశ్నలు రేకెత్తించింది. రిపబ్లిక్ డే ( Republic day ) నాడు జరిగిన పరిణామాల నేపధ్యంలో రక్షణపై దృష్టి సారించారు ఢిల్లీ పోలీసులు. మరోసారి ఎర్రకోట దాడి వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు.  


దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ( Delhi Borders ) ప్రాంతాల్ని ఇప్పుడు శత్రు దుర్బేధ్యకోటలుగా మారుస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇనుప బ్యారికేడ్లు, సిమెంట్ బ్యారికేడ్లతో సరిహద్దులు బ్లాక్ చేస్తున్నారు. సిమెంట్ బ్యారికేడ్లలో కొన్నిచోట్ల ఏకంగా కాంక్రీట్ నింపుతున్నారు. బ్యారికేడ్లు ధ్వంసం చేసి ట్రాక్టర్ ర్యాలీ ( Farmers Tractor Rally ) దూసుకుపోయిన నేపధ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీలోకి రైతులు చొరబడకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ..దుర్బేధ్యమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నారు.


Also read: Union Budget 2021 live updates: సీనియర్ సిటిజన్లకు ( Relief for Senior Citizens ) భారీ ఉరట, మధ్య తరగతికి నిరాశ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook