Union Budget 2021 live updates: సీనియర్ సిటిజన్లకు ( Relief for Senior Citizens ) భారీ ఉరట, మధ్య తరగతికి నిరాశ

Union Budget 2021 live updates: కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ సిటిజన్లకు మాత్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరట కల్పించగా..మధ్య తరగతి ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.

Last Updated : Feb 1, 2021, 03:29 PM IST
Union Budget 2021 live updates: సీనియర్ సిటిజన్లకు ( Relief for Senior Citizens ) భారీ ఉరట, మధ్య తరగతికి నిరాశ

Union Budget 2021 live updates: కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ సిటిజన్లకు మాత్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరట కల్పించగా..మధ్య తరగతి ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. 

కరోనా మహమ్మారి సంక్షేభం, కుదేలైన ఆర్ధిక వ్యవస్థ నేపధ్యంలో నెవర్ బిఫోర్ బడ్జెట్‌గా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Union finance minister Nirmala sitaraman ) అభివర్ణించిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎన్నికల బడ్జెట్‌గా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆదాయపు పన్ను( Income tax ) విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న మధ్య తరగతి ఉద్యోగులకు నిరాశే ఎదురైంది బడ్జెట్‌లో. ఆదాయపు పన్నులపై ఎలాంటి స్పష్టత లేదు.  

అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం నిర్మలా సీతారామన్ ( Nirmala sitaraman )బడ్జెట్‌లో భారీ ఊరట కల్పించారు. 75 ఏళ్లు పైబడిన వారికి ఆదాయపు పన్నుదాఖలు ( Income tax returns ) లో మినహాయింపు ఇచ్చారు. బడ్జెట్ ( Union Budget ) ప్రతిపాదనల్లో ఇది కీలకమైందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎన్ఆర్ఐలకు డబుల్ టాక్సేషన్ నుంచి ఊరట కల్పించారు. పన్ను రిటర్నులకు రీ ఓపెన్ చేసే సమయం ఆరేళ్ల నుంచి మూడేళ్లకు కుదించారు. మరోవైపు పన్ను చెల్లింపు ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్టు ప్రకటించారు. స్టార్టప్‌లకు ట్యాక్స్ మినహాాయింపును మరో ఏడాది  పొడిగించారు. 

ఇక పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉండి.. 75 ఏళ్లు, అంతకు పైబడిన  సినీయర్‌ సిటిజన్ల ( Big relief for senior citizens )కు టాక్స్‌ ఫైలింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే ఎన్నారై పెట్టుబడు దారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఎన్నారైలు భారత్‌లో ఉండే గడువును 182 రోజుల నుంచి 120 రోజులకు కుదించారు. గత బడ్జెట్‌లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తొలగించామని చెప్పారు. ఫేస్‌లెస్ ఇన్‌కంట్యాక్స్ అప్పిలైట్ ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు.  2014లో 3.31 కోట్లున్న పన్ను చెల్లింపుదారులు 2020 నాటికి 6.48 కోట్లకు పెరిగారని  ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

Also read: Union Budget 2021 live updates: పెట్టుబడుల ఉపసంహరణపై బడ్జెట్‌లో కీలక నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News