దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) తల్లడిల్లిపోయింది. భారీవర్షాల ( Heavy rains ) తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం చల్లబడినా వరద ముంపులో చాలా ప్రాంతాలు చిక్కుకుపోయాయి. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలతో ఢిల్లీలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా కీర్తినగర్, రాజ్ పధ్, ఐటీవో, ఇండియా గేట్, తీన్ మూర్తి మార్గ్, రైల్ భవన్, మింటో రోడ్ ప్రాంతాల్లో భారీగా నీరు పేరుకుపోయింది. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మింటో బ్రిడ్జి కింద ఓ బస్సు వరదలో మునిగిపోవడం, ఫైర్ సిబ్బంది ప్రయాణీకుల్ని కాపాడిన దృశ్యాలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో వీడియో వైరల్ అవుతోంది ఢిల్లీ భారీ వర్షాలకు సంబంధించి. 



#WATCH Delhi: A house collapsed in the slum area of Anna Nagar near ITO today following heavy rainfall. No one was present in the house at the time of the incident. Centralised Accident and Trauma Services (CATS) and fire engines are present at the spot. pic.twitter.com/IwS5X08nps



ఐటీవో ( ITO ) సమీపంలోని అన్నానగర్ ( Anna Nagar ) లో భారీ వర్షాల కారణంగా ఓ మురుగునీటి కాలువ ప్రవాహం ధాటికి...ఓ ఇళ్లు చూస్తూ చూస్తుండగానే కూలిపోయింది. అదే ప్రవాహంలో కొట్టుకుపోయింది. Also read: ఢిల్లీలో భారీ వర్షాలు.. చల్లచల్లగా దేశ రాజధాని