Heavy Rains in Delhi: ఢిల్లీను ముంచెత్తిన భారీ వర్షాలు, 46 ఏళ్లలో అత్యధిక వర్షపాతం
Heavy Rains in Delhi: దేశ రాజధాని నగరం ఢిల్లీను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండ్రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి..ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains in Delhi: దేశ రాజధాని నగరం ఢిల్లీను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండ్రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి..ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలతో(Heavy Rains)ఢిల్లీ అతలాకుతలమవుతోంది. శుక్రవారం రాత్రి నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా నగరంలో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు ఇప్పటికే ఆరంజ్ ఎలర్జ్ జారీ అయింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో వరద నీరు పోటెత్తడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ (Delhi Airport)రన్‌వేతో పాటు విమానాశ్రయంలో కూడా వరద నీరు చేరిపోయింది. ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలకు నీరు చేరిపోయింది. భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలు ఆలస్యమయ్యే సూచనలున్నాయని ప్రయాణీకులకు సూచనలు జారీ అయ్యాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మరో రెండ్రోజులు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.
ఇక ఢిల్లీ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మొన్నటి నుంచి భారీవర్షం కురుస్తోంది. నిన్న కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కొనసాగింది. ఇవాళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం నమోదైంది. దేశ రాజధాని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో అయితే ఏకంగా 94.7 మిల్లీమీటర్ల వర్షపాతం(Highest Rainfall) కురిసింది. ఢిల్లీకు సంబంధించి 46 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ వెల్లడించింది. భారీవర్షాల కారణంగా ఢిల్లీ రోడ్లపై నీరు పెద్దఎత్తున చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక దేశ రాజధాని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఢిల్లీలో 987.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 81 శాతం ఎక్కువని ఐఎండీ(IMD) అధికారులు తెలిపారు.
Also read: Increasing Gas Cylinder Price: అక్టోబర్‌లో ఆకాశాన్ని అంటనున్న గ్యాస్ ధరలు.. 60% పెరుగుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook