Delhi Heavy Rains: దేశ రాజధాని నగరం ఢిల్లీను భారీ వర్షాలు ముంచెత్తాయి. 19 ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఒకే రోజులో భారీ వర్షం కురవడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ వర్షాలతో ఢిల్లీ నగరం(Heavy Rains in Delhi)అతలాకుతలమైంది. రాజదాని నగరం ఢిల్లీలో గత 19 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా అతి భారీ వర్షం నమోదైంది. అది కూడా కేవలం 24 గంటల్లో కురిసిన భారీ వర్షం. ఒక్కరోజులో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం నుంచి బుధవారంం ఉదయం వరకూ ఏకంగా 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. కేవలం 3 గంటల వ్యవధిలోనే ఏకంగా 75.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.


భారీ వర్షం కారణంగా ఢిల్లీలోని చాణక్యపురి, ఐటీవో, రోహ్‌తక్ రోడ్ ప్రాంతాల్లోని రహదారులపై వర్షపునీరు భారీ స్థాయిలో చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గత ఏడాది కూడా భారీ వర్షాలు(Heavy Rains) నమోదైనప్పటికీ ఒకేరోజులో ఇంతటి భారీ వర్షం కురిసిన పరిస్థితి లేదు. రాజధాని నగరంలో పెరిగిపోతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల రీతిలో మార్పులొస్తున్నాయని..ఫలితంగా భారీ వర్షాల్ని ముందుగా అంచనా వేయలేకపోతున్నట్టు వాతావరణ శాఖ(IMD) తెలిపింది. తిరిగి ఈ నెల 7వ తేదీ నుంచి ఇదే స్థాయిలో వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. మెరుపు వర్షాలతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు లేవని..వర్షాలు సాధారణంగా పడితేనే ప్రయోజనముంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. 


గతంలో అంటే 2002 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో అత్యధికంగా 126.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరిగి మళ్లీ గత 24 గంటల్లో ఆ స్థాయిలో కురిసింది. అంతకుముందు ఆల్‌టైమ్ రికార్డుగా ఇప్పటికీ పరిగణిస్తున్న వర్షపాతం ఢిల్లీలో 172.6 మిల్లీమీటర్లుగా ఉంది.1963 సెప్టెంబర్ 16వ తేదీన కురిసిన వర్షపాతం ఇప్పటికీ(Delhi All time Record Rainfall)రికార్డుగా ఉంది. 1978 సెప్టెంబర్ 2వ తేదీన 159.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా..1964 సెప్టెంబర్ 26వ తేదీన 142.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ప్రతియేటా సెప్టెంబర్‌లో సరాసరిన 125 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటోంది. 


Also read: Viral: వలలో చిక్కిన 'ఘోల్‌' చేపలు..ఒక్కరోజులో కోటీశ్వరుడైన జాలరి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook