Delhi: ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ ఆస్పత్రికి వేదికైంది. యుద్ధ ప్రాతిపదికన చైనా ...వుహాన్ నగరంంలో నిర్మించిన ఆసుపత్రికి ఇది పదింతలు పెద్దది. ఏకంగా పదివేల బెడ్ ల సామర్ధ్యంతో నిర్మించిన ఈ సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పటల్ ఇవాళ ప్రారంభమైంది.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi) ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ ( World largest covid care hospital ) ఆస్పత్రికి వేదికైంది. యుద్ధ ప్రాతిపదికన చైనా ...వుహాన్ నగరంంలో నిర్మించిన ఆసుపత్రికి ఇది పదింతలు పెద్దది. ఏకంగా పదివేల బెడ్ ల సామర్ధ్యంతో నిర్మించిన ఈ సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పటల్ ఇవాళ ప్రారంభమైంది.
కోవిడ్ 19 వైరస్సం ( Covid 19 virus ) క్రమణ నేపధ్యంలో దేశవ్యాప్తంగా సాధ్యమైనన్ని బెడ్ లను ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైంది. అందుకే వివిధ ప్రాంతాల్లో స్థాయిని బట్టి పెద్ద ఎత్తున బెడ్ లతో తాత్కాలిక ఆస్పత్రుల్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ కరోనా వైరస్ కేసులు ( corona cases in delhi ) ఢిల్లీలో లక్షకు చేరుకున్నాయి. దాంతో నగరంలో భారీ కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఢిల్లీ ఛతర్ పూర్ లో ఉన్న రాధాస్వామి సత్సంగ్ బియాస్ కాంప్లెక్స్ను ( Radhaswamy satsang biyas complex ) ఎంచుకున్నారు. ఈ కాంప్లెక్స్ ను కరోనా ఆస్పత్రిగా ( corona hospital ) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దక్షిణ ఢిల్లీ లో ఏకంగా పదివేల బెడ్ ల సామర్ధ్యంతో ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దారు. 17 వందల అడుగుల పొడుగు, 7 వందల అడుగుల వెడల్పుతో భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఆస్పత్రి ప్రపంచంలోనే అతి పెద్దది. పది వేల బెడ్స్ వరకూ దీని సామర్ధ్యముంది. ప్రస్తుతానికి 2 వేల బెడ్స్ ను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో వుహాన్ నగరంలో చైనా యుద్ధప్రాతిపదికన నిర్మించిన ఆస్పత్రి కంటే ఇది పదింతలు పెద్దది కావడం గమనార్హం. సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ అండ్ హాస్పటల్గా ( Sardar patel covid care and hospital ) నామకరణం చేసిన ఈ సెంటర్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ( Delhi lieutenant governor ) అనిల్ బైజాల్ ప్రారంభించారు. Also read: ICMR COVAXIN: కరోనా వ్యాక్సిన్‌పై స్పష్టత ఇచ్చిన ఐసీఎంఆర్
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో దీన్ని నిర్మించారు. నాలుగు విభాగాలుగా ఈ ఆస్పత్రిని విభజించారు. ప్రతి విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలుంటాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు ( ITBP) విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో సేవలందిస్తారు. వేయి మంది వైద్యులు, 2 వేల వరకూ వైద్య సిబ్బంది ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో విధులు నిర్వహించనున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.