Seaplane services: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో సీప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. యమునా నది సీప్లేన్ సేవలతో కొత్త అందాలు సంతరించుకోనుంది. త్వరలో  బిడ్‌ల ప్రక్రియ ప్రారంభం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గుజరాత్ ( Gujarat ) సబర్మతి రివర్‌ఫ్రంట్ ( Sabarmati Riverfront ) వద్ద ఏర్పాటు చేసినట్టే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కూడా సీప్లేన్ సేవలు ( Seaplane services ) ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ శివార్లలోని యమునా నదీ తీరం ( Yamuna riverfront ) సీప్లేన్ అందాల్ని సంతరించుకోనుంది. సీ ప్లేన్ సేవల్ని అందించేందుకు ఆసక్తి కలిగిన కంపెనీలు కేంద్ర నౌకాయాన, నౌకాశ్రయ, జలమార్గాల మంత్రిత్వ శాఖను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.


ఢిల్లీ సమీపంలోని రాష్ట్రాలకు సీప్లేన్ సర్వీసుల్ని అనుసంధానించనున్నారు. ఉత్తరప్రదేశ్‌ ( Uttar pradesh ) లోని అయోధ్య, ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, శ్రీనగర్ ప్రాంతాలకు ఢిల్లీతో అనుసంధానించనున్నారని సాగర్‌మాల డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ ( Sagarmala development company ) తెలిపింది. పౌర విమానయాన రంగంలో అనుభవం కలిగి కంపెనీలతో కలిసి పనిచేసేందుకు సాగర్‌మాల డెవలప్‌మెంట్ కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది.


ప్రస్తుతానికి సీప్లేన్ సేవలకు ( Seaplane services ) నౌకాయన శాఖ ఢిల్లీని హబ్‌గా పరిగణిస్తోంది. ఢిల్లీని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు చండీగఢ్‌ను కూడా కలపనున్నారు. అటు కేదార్‌నాధ్, బద్రీనాధ్, హిమాచల్‌ప్రదేశ్ ( Himachal pradesh )‌లోని దాల్‌హౌస్ ప్రాంతాల్ని కూడా సీప్లేన్ సర్వీసులతో కలపాలని యోచిస్తున్నారు. 


Also read: Indian vaccine: వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అనుమతిపై కాంగ్రెస్ అభ్యంతరం