Dengue cases: Centre rushes high-level teams to 9 states, UTs to curb infection: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డెంగీ (Dengue) విజృంభిస్తోంది. గతకొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, హరియాణా, ఢిల్లీల్లో డెంగీతో చిన్నారులు మరణిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమూంది. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health) ప్రత్యేక బృందాలను పంపింది. ఆయా రాష్ట్రాలకు (states)ఈ బృందాలు సూచనలు ఇవ్వనున్నాయి. అలాగే డెంగీ నివారణకు సాంకేతిక సహాయం అందించనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీతో పాటు హరియాణా, (Haryana) పంజాబ్‌, కేరళ, (Kerala) రాజస్థాన్‌, తమిళనాడు,(Tamil Nadu) ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌ లలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (National Center for Disease Control) (ఎన్‌సీడీసీ)తో పాటు నేషనల్‌ వెక్టార్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం (national vector borne disease control programme) నిపుణులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు.


Also Read : Diwali Offers: అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లో ముగుస్తున్న దీపావళి ప్రత్యేక ఆఫర్లు


డెంగీ (Dengue) తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజారోగ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించడంతో పాటు వ్యాధి కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను ఈ బృందం తెలుసుకోనుంది. ఇక ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించనున్నారు.


ఢిల్లీలోనే (Delhi) ఈ ఏడాదిలో 1530 డెంగీ కేసులు బయటపడ్డాయి. వీటిలో ఒక్క అక్టోబర్‌‌లోనే 1200 కేసులు వెలుగులోకి రావడం ఆశ్చర్యకరం. గడిచిన నాలుగేళ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. 


దేశవ్యాప్తంగా డెంగీ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో డెంగీ వ్యాప్తి అధికంగా ఉన్న 200 జిల్లాలను ఇప్పటికే గుర్తించారు. డెంగీపై (Dengue) అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు వ్యాధి నిర్ధరణ పరీక్షలు కూడా వేగంగా జరిపాలంటూ ఆయా రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు సూచిస్తున్నాయి.


Also Read : Ram Charan: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రామ్ చరణ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి