Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకున్నా తమకు సమ్మతమే అని అన్నారు మహారాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.  బీజేపీకి తగ్గట్టుగా శివసేన కూడా ప్రధాని మోడీ నిర్ణయానికి మద్దతిస్తుందని తెలిపారు. బాలాసాహెబ్‌ దారిలో తమ ప్రయాణం ఉంటుందన్నారు. తమ వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బంది లేదని నరేంద్ర మోడీ, అమిత్  షాకు చెప్పానన్నారు ఏక్‌నాథ్‌. తాను జీవితంలో సీఎం అవుతానని అనుకోలేదనీ.. కానీ తనకు అవకాశం వచ్చిందని ఏక్‌నాథ్ షిండే గుర్తు చేశారు. మొత్తంగా  మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ మరికాసేట్లో  వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం పదవి బీజేపీకే దక్కనుంది. శివసేన అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే కాస్త మెత్తబడ్డారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం అభ్యర్థి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ, అమిత్‌ షాలదే తుది నిర్ణయమన్నారు.  వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నిన్న మీడియా ముఖంగా షిండే ప్రకటించారు. దీంతో రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై భారతీయ జనతా పార్టీ  అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


ఫడణవీస్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నెల 30నగానీ, డిసెంబర్‌ 1నగానీ కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు ఏక్ నాథ్ శిండే, దేవేంద్ర ఫడణవీస్, అజిత్‌ పవార్‌లు ఢిల్లీకి రావాలని బీజేపీ హై కమాండ్  నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. వారు అమిత్‌ షాతో భేటీ అయ్యాక సీఎం పదవి, ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇవాళ ఢిల్లీలో మహాయుతి భేటీ జరగనున్నట్లు సమాచారం.


కొత్తగా ఏర్పడే మహాయుతి ప్రభుత్వంలో తన కుమారుడు శ్రీకాంత్‌ శిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఏక్‌నాథ్‌ శిండే పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్‌ ప్రస్తుతం కల్యాణ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతోపాటు తనకు మహాయుతి కూటమి కన్వీనర్‌ పదవి ఇవ్వాలని శిండే డిమాండు చేస్తున్నట్లు సమాచారం.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter