Sabarimala Temple: కోట్లాది మంది భక్తులు సందర్శించే శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. స్వామి దర్శనం కోసం వచ్చిన అయ్యప్ప భక్తుడు ఆలయ ప్రాంగణంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలయ క్షేత్రంలో తీవ్ర కలకలం రేపింది. అయితే అతడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఆలయంలోనే ఎందుకు? అనే అంశంపై పోలీసులు విచారణను తీవ్రం చేశారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BRS Party: రైతులు జైల్లో మగ్గుతుంటే రేవంత్‌ రెడ్డి, మంత్రుల్లో రాక్షసానందం


కేరళలోని పట్టినంటిట్ట జిల్లాలో శబరిమల క్షేత్రం ఉంది. మాలధారణ సమయం కావడంతో అయ్యప్ప స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన జగన్ సంపత్‌ ఆలయానికి వచ్చాడు. మరికొందరు అతడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కుమార స్వామి అనే పేరు అని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం సాయంత్రం అయ్యప్ప ఆలయంలోని నెయ్యి కేంద్రం వద్ద రూఫ్‌పైకి ఎక్కి ఒక్కసారిగా కిందకు దూకాడు.

Also Read: Family Clashes: వేట్లపాలెంలో కత్తులతో వీరవిహారం.. కుటుంబ గొడవల్లో ముగ్గురి మృతి


కిందపడడంతోనే అతడి కాళ్లు.. వీపు భాగంపై తీవ్ర గాయాలవగా వెంటనే ఆలయ అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అధిక రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే అతడు మరణించాడు. అయితే అతడు ఆత్మహత్యకు పాల్పడడం వెనుక కారణాలు ఏమిటనేవి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి శబరిమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.


మృతుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజుల పాటు ఆలయంలోనే అతడు గడిపినట్లు తేలింది. మానసిక వ్యాధితో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అతడి మానసిక వ్యాధి తగ్గాలని అతడి కుటుంబసభ్యులు అయ్యప్ప మాల వేయించినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా అయ్యప్ప ఆలయంలో ఇలాంటి ఆత్మహత్య జరగడం రెండోసారి. గతంలో కేరళకు చెందిన భక్తుడు ఆలయ క్షేత్రంలోనే నిప్పంటించుకుని ఆత్మార్పణం చేసుకున్నాడు. ఆ సంఘటన నాడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.