Tragic Incident: ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన గొడవ చినికి చినికి గాలివానగా మారింది. పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఇరు కుటుంబసభ్యులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. అయితే వారి మధ్య ఆస్తి వివాదం తీవ్రరూపం దాల్చుకుంది. ఫలితంగా పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ వార్త రాసే సమయానికి అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Zakir Hussain: మూగబోయిన సంగీత లోకం.. తబాలా విధ్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీ చెరువు వద్ద కారతాల పండు అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. అక్కడ మరో నిర్మాణం చేయాలని బచ్చల చక్రయ్య కుటుంబీకులు పట్టుబట్టారు. కొన్ని రోజుల నుంచి పండు, చక్రయ్య కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు కుటుంబాల మధ్య ఆదివారం తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది.
Aslo Read: Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు
అయితే పండు ఇంటి నిర్మాణ స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చక్రయ్య కుటుంబసభ్యులు పట్టుబట్టారు. ఆదివారం అంబేడ్కర్ విగ్రహం తీసుకువస్తుండగా ఇరు వర్గాలు గొడవపడ్డారు. బచ్చల కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కత్తులతో కూడా దాడి చేసుకున్నారు. విచక్షణారహితంగా కత్తులతో విరుచుకుపడడంతో ఈ ఘటనలో కారదాల ప్రకాశరావు (50) తీవ్ర గాయాలతో అక్కడకక్కడే మృతి చెందాడు. కారదాల యేసు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన కారదాల చందర్రావు (60) ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.
జిల్లాలో కలకలం
గొడవల్లో బచ్చలచ్చన సుబ్బారావు, కారదాల పండు, కారదాల బాబీలకు తీవ్ర గాయాలవగా గ్రామస్తులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. సమాచారం అందుకున్న సామర్లకోట పోలీసులు గ్రామాన్ని సందర్శించినట్లు సమాచారం. ఘటన వివరాలు తెలుసుకుంటున్నారు. ఘర్షణల్లో ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో భయాందోళన రేపింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబసభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.