కోల్‌కతా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ న్యూఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లడానికి కార్గో ఫ్లైట్ ఉపయోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కేంద్రం కోరింది. రాష్ట్రంలో విపత్కర కరోనావైరస్ పరిస్థితుల మధ్య కేంద్రం మమత సర్కారుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రప్పించారన్న ఆరోపణ నేపథ్యంలో విచారణ ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. చైనాలో తగ్గుతున్న కరోనా కేసులు..!!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రశాంత్ కిషోర్ దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ ఆదేశాలను ధిక్కరించి విమానంలో ప్రయాణించడానికి ప్రయత్నించారా అని, ఈ దశలో క్షుణ్ణంగా తనిఖీ చేయమని విమానాశ్రయాలను నుండి సమాచారం కోరిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ ఇవి అవాస్తవమని, మార్చి 19 తర్వాత నేను ఏ విమానాశ్రయానికి వెళ్ళలేదని, దీనికి విరుద్ధంగా ఎవరికైనా సమాచారం ఉంటే, వారు ఆ వివరాలను ప్రజా క్షేత్రంలో ఉంచాలని ఆయన ఘాటుగా స్పందించారు.


Also Read: సచిన్... ది గ్రేట్ బౌలర్.. హీరోగా నిలిపిన ప్రదర్శనలివే


కోల్‌కతాకు కార్గో విమానాలు నడుపుతున్న విమానయాన సంస్థలను సమాచారం కోరగా వారు ఎటువంటి ప్రమేయం లేదన్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)లోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అంతర్జాతీయ, దేశీయ దేశవ్యాప్తంగా మార్చి 25 నుండి నిలిపివేయబడ్డాయి. కార్గో విమానాలు మాత్రమే నడపడానికి అనుమతించబడ్డాయని, లాక్డౌన్ అయినప్పటి నుండి ఇప్పటివరకు 347 కార్గో విమానాలను అత్యవసర సేవలకు వినియోగిస్తున్నారని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos 


ఇది కూడా చదవండి: భారత క్రికెటర్లపై విషం చిమ్మిన ఇంజమామ్ ఉల్ హక్