భారత క్రికెటర్లపై విషం చిమ్మిన ఇంజమామ్ ఉల్ హక్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ భారత క్రికెటర్లపై విషం చిమ్మాడు. భారత క్రికెటర్లు దేశం కోసం ఆడరని, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆడతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 24, 2020, 10:59 AM IST
భారత క్రికెటర్లపై విషం చిమ్మిన ఇంజమామ్ ఉల్ హక్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ భారత క్రికెటర్లపై విషం చిమ్మాడు. భారత క్రికెటర్లు దేశం కోసం ఆడరని, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆడతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో చోటు సంపాదించుకోవడానికి యత్నించేవారని, జట్టు కోసం వారు ఆడిన దాఖలాలు లేదని మాజీ క్రికెటర్ రమీజ్ రాజాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింట్ కామెంట్లు చేశాడు.  Photos: లేటు వయసులో బికినీ అందాలు

‘సొంత రికార్డులు, స్వలాభం కోసమే భారత క్రికెటర్లు సెంచరీలు చేసేవారు. దేశం కోసం ఆడుతున్నట్లు భావించేవారు కాదు. కానీ పాకిస్థాన్ క్రికెటర్లు అలా కాదు. జట్టు గెలుపే లక్ష్యంగా, దేశ ప్రయోజనాల కోసమే ఆడేవారు. పేపర్ మీద భారత బ్యాటింగ్ స్ట్రాంగ్ ఆర్డర్ కనిపిస్తుంది. వారితో పోల్చితే పాక్ క్రికెటర్ల రికార్డులు చాలా మామూలుగా ఉంటాయి. కరోనాను తరిమికొట్టిన మరో రాష్ట్రం

పాక్ క్రికెటర్లు 30, 40 పరుగులు చేసినా అది జట్టు ప్రయోజనం కోసమే. కానీ భారత క్రికెటర్లు శతకాలు నమోదు చేసినా అది కేవలం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం. జట్టు కోసం మాత్రం కాదు. పాక్, భారత్ క్రికెటర్ల మధ్య ప్రధాన వ్యత్యాసమిదే. జట్టులో చోటు దక్కుతుందా లేదా అని మా క్రికెటర్లు ఆందోళన చెందరు. ఆ మహిళ సేఫ్.. 19సార్లు పాజిటివ్.. 20వ టెస్టులో ఊరట 

కేవలం ఓ రెండు, మూడు మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు జట్టులో చోటు ఖాయమని భారత క్రికెటర్లు భావిస్తారు కానీ జట్టుకు ఏది మేలు చేస్తుందో ఆలోచించరు. ఒకటి రెండు సిరీస్‌లలో విఫలమైనా తమ కెప్టెన్లు ఆటగాళ్లకు మద్దతుగా నిలిచేవారంటూ’ పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్టర్  ఇంజమామ్ ఉల్ హక్ భారత ఆటగాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News