చైనాలో తగ్గుతున్న కరోనా కేసులు..!!

'కరోనా వైరస్'.. పుట్టిల్లు చైనా. వుహాన్ లో 2019 డిసెంబర్ లో ఈ వైరస్ పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు అనతి కాలంలోనే వ్యాపించింది. ఇప్పుడు 200 దేశాలకు పైగా దేశాలను ఈ మహమ్మారి భయపెడుతోంది.

Last Updated : Apr 24, 2020, 04:30 PM IST
చైనాలో తగ్గుతున్న కరోనా కేసులు..!!

'కరోనా వైరస్'.. పుట్టిల్లు చైనా. వుహాన్ లో 2019 డిసెంబర్ లో ఈ వైరస్ పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు అనతి కాలంలోనే వ్యాపించింది. ఇప్పుడు 200 దేశాలకు పైగా దేశాలను ఈ మహమ్మారి భయపెడుతోంది. కానీ ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే.. చైనాలో ఇప్పుడు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. నమ్మశక్యం కాకున్నా.. ఇది నిజం..!

చైనాలో కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కు పడిపోయింది. ఈ మేరకు శుక్రవారం నాటి హెల్త్ బులెటిన్ ను చైనా జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడించింది. కేవలం 6 మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. అందులో రెండు కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి కాగా.. మరో నాలుగు కేసులు స్థానికంగా వ్యాప్తి చెందినవని వెల్లడించింది. మొత్తంగా గురువారం వరకు చైనాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 84 వేల 302.  అందులో 4 వేల 632 మంది మృతి చెందారు. విదేశాల నుంచి కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిన వారి సంఖ్య 16 వందల 18 మంది. వారిలో 32 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 34 మంది లక్షణాలు లేకుండా ఉన్నారని చైనా జాతీయ ఆరోగ్య  మిషన్ వెల్లడించింది.
 
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కరోనా వైరస్ కు పుట్టిల్లుగా ఉన్న హుబీ ప్రావిన్స్ రాజధాని వుహాన్ లో ఇప్పుడు కొద్ది రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వుహాన్ లో ఏప్రిల్ 8న లాక్ డౌన్ ఎత్తేశారు. ప్రజలను అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిచ్చారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News