సచిన్... ది గ్రేట్ బౌలర్.. హీరోగా నిలిపిన ప్రదర్శనలివే

భారత్‌లోనే కాదు అంతర్జాతీయంగా ఎంతో మందికి క్రికెట్‌లో ఆరాధ్యదైవం సచిన్. అది కేవలం పేరు మాత్రమే కాదు ఓ బ్రాండ్. కొన్ని తరాలకు తరగని స్ఫూర్తి.

Last Updated : Apr 24, 2020, 04:59 PM IST
సచిన్... ది గ్రేట్ బౌలర్.. హీరోగా నిలిపిన ప్రదర్శనలివే

సచిన్ టెండూల్కర్.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లోనే కాదు అంతర్జాతీయంగా ఎంతో మందికి క్రికెట్‌లో ఆరాధ్యదైవం సచిన్. అది కేవలం పేరు మాత్రమే కాదు ఓ బ్రాండ్. కొన్ని తరాలకు తరగని స్ఫూర్తి. అతడు అంతగా మాట్లాడకున్నా.. రికార్డులే అతడి గురించి మాట్లాడేలా చేశాయి. నేడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. ఏప్రిల్ 24న 47వ వసంతంలోకి అడుగుపెట్టాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar Birthday Special). 

తన బ్యాట్‌తో అరివీర భయంకర ఫాస్ట్ బౌలర్లకు, దిగ్గజ స్పిన్ మాంత్రికులకు సమాధానం చెప్పాడు. అయితే సచిన్ పేరు చెప్పగానే ఎక్కువగా గొప్ప బ్యాట్స్‌మెన్ అనే ఆలోచన మనకు వస్తుంది. కానీ సచిన్ పేరు చెబితే మంచి బౌలర్ అని చెప్పుకోవచ్చు. కెరీర్‌లో 463 వన్డేలాడిన సచిన్ 154 వికెట్లు తీశాడు. 200 టెస్టులాడిన సచిన్ 46 మంది ఔట్ చేశాడు. జట్టులో బంతి అందుకోవడానికి సీనియర్ బౌలర్లు ముఖం చాటేస్తుంటే చిరునవ్వుతో కెప్టెన్ నుంచి బంతి అందుకుని జట్టుకు విజయాలందించిన సందర్భాలున్నాయి. అందుకు ఉదాహరణగా కొన్ని విశేషాలు.. నన్ను పెద్దోడిలా చూడట్లేదు: విజయ్ దేవరకొండ

1991లో పెర్త్‌లోని బౌన్సీ పిచ్ వాకాలో వన్డే 
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 126 పరుగులు చేసి ప్రత్యర్థి వెస్టిండీస్‌కు 127 పరుగుల అతిస్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది భారత్. విండీస్ సైతం ఛేదనలో 40 ఓవర్లు ముగిసేరికి 9 వికెట్లు కోల్పోయింది. పేస్ బౌలర్ల కోటా పూర్తికావడంతో ఒత్తిడిలో ఉన్న కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ 18ఏళ్ల యువకుడు సచిన్ చేతికి బంతినిచ్చాడు. ఆ ఓవర్ చివరి బంతికి అండర్సన్ కమిన్స్‌‌ను ఔట్ చేశాడు. ఫస్ట్ స్లిప్‌లో కెప్టెన్ అజార్ ఆ క్యాచ్ అందుకున్నాడు. విండీస్ సైతం సరిగ్గా 126 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్ టై అయింది. సచిన్ బౌలింగ్ కారణంగా జట్టు అంత స్వల్ప స్కోరును కాపాడుకుంది.  

1993లో హీరో కప్ సెమీఫైనల్
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 195 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో చివరి ఓవర్‌లో సఫారీల విజయానికి 6 పరుగులు కావాలి. కెప్టెన్ అజహరుద్దీన్ సచిన్ చేతికి బంతి ఇచ్చాడు. ఫాన్ డివిలియర్స్ రనౌట్ అయ్యాడు. తర్వాత అలెన్ డొనాల్డ్ తన బాల్‌ను హిట్టింగ్ చేయకూడదని సచిన్ చాలా స్లో బంతులు వేసి డాట్ బాల్స్ చేశాడు. చివరి ఆ ఓవర్‌లో కేవలం 3 పరుగులు ఇవ్వడంతో 2 పరుగుల తేడాతో జట్టును గెలిపించాడు. ఫైనల్లో కీలకమైన బ్రియాన్ లారా వికెట్‌ను పడగొట్టాడు.. ఆ మహిళ సేఫ్.. 19సార్లు పాజిటివ్.. 20వ టెస్టులో ఊరట

1998లో ఆస్ట్రేలియాతో మ్యాచ్
కొచ్చిలో జరిగిన వన్డేలో భారత్ 310 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు నిర్ధేశించింది. సచిన్ 5/32 చెలరేగడంతో ఆసీస్ కుదేలైంది. కీపర్ నయన్ మోంగియాతో కలిసి సచిన్ స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. రైట్ హ్యాండ్ బ్యాట్‌మెన్‌కు లెగ్ స్పిన్, లెఫ్ట్ హ్యాండర్లకు ఆఫ్ స్పిన్ బంతులు సంధిస్తూ 5 వికెట్లు పడగొట్టి 41పరుగుల భారీ విజయాన్ని అందించాడు సచిన్.

2005లో పాకిస్థాన్‌పై
కొచ్చి వేదికగా మరోసారి సిచిన్ మ్యాజిక్ చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 281 రన్స్ చేసింది. సిచిన్ స్పిన్ మాయాజాలంతో పాకిస్థాన్‌పై 87 పరుగుల భారీ విజయాన్ని భారత్ ఆస్వాదించింది. సచిన్ 5/50తో పాక్ బ్యాట్స్‌మెన్ నుంచి సమాధానం కరువైంది.

టెస్టుల్లోనూ బౌలింగ్ హీరో..
1992లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో మార్క్ టేలర్(11), ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్ డకౌట్ వికెట్లు పడగొట్టడంతో కేవలం 145 పరుగులకే కుప్పకూలింది. ఇయాన్ హెలీ క్యాచ్ మిస్ కావడంతో మూడో వికెట్ మిస్సయింది. ఇది పార్ట్ టైమర్ సూపర్ స్పెల్.

2003లో మరోసారి..
అడిలైడ్‌ టెస్టులో రాహుల్ ద్రావిడ్ డబుల్ సెంచరీ (233), హాఫ్ సెంచరీ (72 నాటౌట్) ఇన్నింగ్స్‌లకు తోడు సచిన్ బౌలింగ్ భారత్‌కు విజయాన్ని అందించింది. రెండో ఇన్నింగ్స్‌లో సచిన్ కీలకమైన ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ వా, మార్టిన్ వికెట్లు పడగొట్టి భారత్ విజయానికి బాటలు వేశాడు. ఈ రెండు క్యాచ్‌లు ద్రావిడ్ పట్టడం విశేషంPhotos: లేటు వయసులో బికినీ అందాలు

2001లో ఆస్ట్రేలియాతో టెస్ట్
కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ భారత క్రికెట్ చరిత్రనే తిరగరాసింది. ఈ మ్యాచ్‌లో ఫాలో ఆన్ ఆడిన భారత్ లక్ష్మణ్ 281 పరుగులు, ద్రావిడ్ 180 ఇన్నింగ్స్‌తో కోలుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ వికెట్లు సాధించగా, ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో టెండూల్కర్ వారి భరతం పట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న హెడేన్(67), అడమ్ గిల్ క్రిస్ట్, షేన్‌వార్న్‌లను డకౌట్ చేసి ఆసీస్ వెన్ను విరిచాడు. మిగిలింది అందరికీ తెలిసిందే చారిత్రక విజయం. భారత క్రికెటర్లపై విషం చిమ్మిన ఇంజమామ్ ఉల్ హక్

1999లో పాకిస్థాన్‌పై మరో అద్భుతం
చెన్నై వేదికగాక జనవరిలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో సచిన్ శతకాన్ని (136) క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ మ్యాచ్‌లో పాక్ కీలక ఆటగాళ్లు ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ యూసఫ్ వికెట్లు తనకెంతో సంతోషాన్ని కలిగించాయని సచిన్ సైతం పలు సందర్భాలలో ప్రస్తావించాడు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x