Sputnik v Vaccine: దేశంలో మరో 9 నగరాల్లో స్పుట్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులో
Sputnik v Vaccine: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గుడ్‌న్యూస్ అందించింది. రష్యన్ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి ను దేశంలోని మరో 9 నగరాల్లో అందుబాటులో తీసుకురానుంది.
Sputnik v Vaccine: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గుడ్‌న్యూస్ అందించింది. రష్యన్ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి ను దేశంలోని మరో 9 నగరాల్లో అందుబాటులో తీసుకురానుంది.
దేశంలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.ఇందులో రష్యన్ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ స్పుట్నిక్ విను దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పంపిణీ చేస్తోంది. దేశంలో తొలిసారిగా ఈ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys labs)హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్‌ను ప్రస్తుతం కోవిన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం లేదు. పైలట్ లాంచింగ్ ప్రక్రియలో ఉందని..రెండు డోసుల వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం జరగుతోందని రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకూ స్టోర్ చేసుకునే పరిస్థితి ఉంది.
స్పుట్నిక్ వి వ్యాక్సిన్‌ను(Sputnik v Vaccine) త్వరలో దేశంలోని మరో 9 నగరాల్లో అందుబాటులో తీసుకొస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కత్తా, చెన్నై, విశాఖపట్నం, బడ్డీ, కొల్హాపూర్, మిర్యాలగూడ నగరాలున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook