Electricity charges in UP: రైతులకు యోగీ సర్కార్ గుడ్ న్యూస్- విద్యుత్ ఛార్జీలు 50% తగ్గింపు!
Electricity charges in UP: యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు విద్యుత్ ఛార్జీలు 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Electricity charges in UP: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతులపై వరాల జల్లు కురిపించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. రైతులకు విద్యుత్ బిల్లులను 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం (Electricity charges cut 50 pc in UP) వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో (UP Elections 2022) వివిధ రాజకీయ పార్టీలు ఉచిత విద్యుత్ ప్రకటన చేయగా.. అధికార బీజేపీ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా (UP Govt on Electricity charges) వెల్లడించింది.
కాగా నిర్ణయంతో మీటర్ కనెక్షన్ ఉన్నపై యూనిట్ విద్యుత్‌కు ఒక రూపాయి ఛార్జీ ( New Electricity charges in UP) చేయనున్నారు. ఇంతకు ముందు ఇది రూ.2గా ఉంది.
ఒక హార్స్ పవర్ మీటర్‌పై ఛార్జీని రూ.70 నుంచి రూ.35కు (Good news for Farmers) తగ్గించనున్నారు.
మీటర్ లేని కనెక్షన్‌కు ఒక హార్స్ పవర్‌కు రూ.85 ఛార్జీ విధించనుంది యూపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఇది రూ.170గా ఉంది.
ఇక పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి మీటర్ కనెక్షన్‌పై యూనిట్ విద్యుత్‌కు రూ.3 చొప్పున ఛార్జీ వసూలు చేయనున్నరు. ప్రస్తుతం ఇది రూ.6గా ఉంది. ఫిక్స్డ్ మీటర్ ఛార్జీ రూ.130 నుంచి రూ.65కు తగ్గనుంది.
ఇతర పార్టీల హామీలు ఇలా..
ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలు విద్యుత్ ఛార్జీలపై హామీలు ఇచ్చాయి. రైతులు 300 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని సమాజ్‌వాది (SP on Electricity Charges in UP) పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు హామీలు (AAP on Electricity Charges in UP) ఇచ్చాయి.
Also read: Ayodhya Earthquake: అయోధ్య సమీపంలో భూకంపం.. భయాందోళనల్లో ప్రజలు!!
Also read: Omicron Death: ఒమిక్రాన్ డేంజర్ బెల్స్.. కొత్త వేరియంట్‌తో దేశంలో రెండో మరణం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook