Oxygen Tankers: కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో విదేశాల్నించి పెద్దఎత్తున సహాయం అందుతోంది. ముఖ్యంగా ఆక్సిజన్ పెద్దఎత్తున చేరుతోంది. థాయ్‌లాండ్ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు చేరనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య పెరగడంతో కరోనా విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత,  వైద్య సామగ్రి కొరత ఏర్పడటంతో విదేశాలు పెద్దఎత్తున సహాయం చేస్తున్నాయి. మరోవైపు దేశంలోని ప్రముఖ సంస్థలు సామాజిక సేవలో భాగంగా రప్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయ్‌లాండ్ నుంచి భారీగా ఆక్సిజన్ ట్యాంకర్లను ఇండియాకు దిగుమతి చేస్తోంది. థాయ్‌లాండ్ (Thailand) నుంచి మరో 11 క్రయోజనిక్ ట్యాంకుల్ని(Cryogenic Tankers) దిగుమతి చేస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. యుద్ధ ప్రాతిపదికన ట్యాంకులు దిగుమతి కానున్నాయి. ఒక్కో క్రయోజనిక్ ట్యాంకర్‌లో 1 కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. దేశంలో తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున దిగుమతి చేయనున్నారు.


తొలి విడతలో ఆర్మీ విమానంలో మూడు ట్యాంకర్లు వస్తున్నాయి. మద్యాహ్నం మూడు గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేకమైన డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఆక్సిజన్ ట్యాంకర్లు చేరనున్నాయి.


Also read: Serum Institute: వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీరమ్ ఇనిస్టిట్యూట్ సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook