Rahul Gandhi: కరోనా కట్టడిలో భారత్ కన్నా.. పాక్, ఆప్ఘాన్‌లే నయం
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
Rahul Gandhi criticised the PM Modi led Govt: న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కోవిడ్ (Coronavirus) ను అరికట్టే విషయంలో భారత్ కంటే పాక్, ఆఫ్గనిస్తాన్‌లే బెటర్‌గా పనిచేశాయిని ట్విట్టర్ వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వ మరో అద్భుతమైన ఘనత అంటూ రాహుల్ ట్విట్ చేశారు. కరోనా కట్టడిలో భారత్ కన్నా పాకిస్తాన్, అఫ్ఘానిస్తానే బెటర్‌గా పనిచేశాయంటూ.. మన పొరుగు దేశాల జీడీపీలను, మన దేశ జీడీపీని పోలుస్తూ ఐఎంఫ్ (International Monetary Fund) ఇచ్చిన అంచనాల గ్రాఫ్‌ను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. Also read: Kapil Deo Kamat: కరోనాతో బీహార్ మంత్రి కామత్ కన్నుమూత
అయితే ఈ గ్రాఫ్‌లో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, చైనా, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా దేశాల 2020-2021 జీడీపీ (GDP) లెక్కలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఈ సారి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం సాధించిన అద్భుతమైన ఘనత అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం కుంచించుకుపోతుందని మంగళవారం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) పేర్కొన్న విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ ఇచ్చిన జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తావిస్తూ.. రాహుల్ బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి విమర్శించారు.
Also read: Rafale Aircraft: నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe