Rafale Aircraft: నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్ యుద్ధ విమానాలు

భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు వచ్చే నెల నవంబర్‌లో భారత్‌కు రానున్నాయి. 

Last Updated : Oct 16, 2020, 08:20 AM IST
Rafale Aircraft: నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్ యుద్ధ విమానాలు

Second batch of Rafale Fighter Jets: న్యూఢిల్లీ: భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు వచ్చే నెల నవంబర్‌లో భారత్‌కు రానున్నాయి. ఈ మేరకు భారత వాయుసేన (IAF) యుద్ధ విమానాల రవాణా, పైలట్లకు శిక్షణ కోసం ఒక బృందాన్ని ఫ్రాన్స్‌ (France) కు పంపింది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో రెండో బ్యాచ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు ( Rafale Jets Second Batch ) కూడా భారత్‌కు చేరవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి విడతలో వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు జూలై 29న భారత్‌కు చేరిన విషయం తెలిసిందే.  అయితే రాఫెల్స్ కోసం అంబాలా ఎయిర్‌ బేస్‌లో ‘గోల్డెన్‌ యారోస్‌’ అనే పేరుతో కొత్త ఎయిర్‌ స్క్వాడ్రన్‌ను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రాఫెల్స్‌ను సెప్టెంబరు 10న అధికారికంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. Also read: Rafale Fighter Jets: సర్వమత ప్రార్థనలతో.. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్స్

అయితే.. ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి బ్యాచ్‌గా ఐదు రాఫెల్‌ జెట్స్‌ భారత్‌కు చేరాయి. ఇంకా 31 యుద్ధ విమానాలు భారతదేశానికి రావాల్సి ఉంది. ఇప్పుడు రెండో విడతలో మరికొన్ని విమానాలు దేశానికి చేరనున్నాయి. ఇదిలాఉంటే.. 2023 నాటికి ఐఏఎఫ్‌లో మొత్తం 36 రాఫెల్స్‌ చేరుతాయని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా (RKS Bhadauria) ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  

ఇదిలాఉంటే.. తూర్పు లఢఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అత్యధునిక యుద్ధ విమానాలు రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి మోహరించారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌ ఏమాత్రం వక్రబుద్ధి చూపించినా.. తగిన బుద్ధి చెప్పేందుకు, వారి ఆట కట్టించేందుకు భారత ఆర్మీ, భారత వాయుసేన ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాఫెల్స్‌ రెండో బ్యాచ్‌ భారత్‌కు చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. Also read : Telangana floods: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News