Ex-Union Minister Raghuvansh Prasad Singh passes away: న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ మాజీ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) కన్నుమూశారు. ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రఘువంశ్ ప్రసాద్ (Raghuvansh Prasad) ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. శనివారం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కరోనా (Coronavirus) బారిన పడి కోలుకున్న రఘువంశ్ ప్రసాద్.. అనంతరం ఆయనకు మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం కిందట ఆయన ఎయిమ్స్‌లో చేరి చికిత్సపొందుతున్నారు. Also read: Prashant Bhushan: మళ్లీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భూషణ్


ఆర్జేడీ నేత.. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌కు ప్రధాన అనుచరుడైన రఘువంశ్ ప్రసాద్ తన ప్రత్యర్థి పార్టీలోకి చేరుతున్నారని తెలియడంతో.. సెప్టెంబరు 10న ఆర్జేడీకి రాజీనామా చేశారు. ఆతర్వాత ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి బహిరంగ లేఖ రాసి జేడీయూలోకి చేరాలని యోచిస్తున్నట్లు పేర్కొని రాజకీయ ఊహగానాలకు తెరదించారు. Also read: Kangana Ranaut: ‘నేనూ డ్రగ్స్‌కు బానిసయ్యా’.. కంగనా పాత వీడియో వైరల్