Farmers protest: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఇప్పట్లో ఆగే సూచనలు కన్పించడం లేదు. చట్టాల్ని రద్దు చేయమని..అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం ( Central Government ) కొత్తగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు ( New Farm Bills ) వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ( Delhi Borders ) రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగారు. దాదాపు నెలరోజులకు పైగా సాగుతున్న  రైతుల నిరసన ( Farmers protest ) ను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా రైతు సంఘాలతో చర్చించింది. కానీ చర్చలు విఫలమై ఆందోళన ఇంకా కొనసాగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. దీనికి కారణం కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ( Union minister Narendra singh tomar )..చేసిన వ్యాఖ్యలేనని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత సర్వాన్ సింగ్ పందేర్ తెలిపారు. జనవరి 4న అంటే ఇవాళ కేంద్రమంత్రి, అధికార్లతో ఏడవ దశ చర్చలు ముగిశాక..సర్వాన్ సింగ్ పందేర్ మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయమని..అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లమని చెప్పినట్టు రైతు సంఘ నేతలు స్పష్టం చేశారు. 


పంటలకు కనీస మద్దతు ధర ( MSP )కై చట్టబద్దతపై చర్చిద్దామని కేంద్రమంత్రులు ప్రతిపాదించారు. కానీ రైతు సంఘాల నేతలు మాత్రం వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలన్న డిమాండ్ నుంచి వెనక్కి తగ్గలేదు. డిమాండ్లు ఆమోదించకపోతే రిపబ్లిక్ దినోత్సవం నాడు ట్రాక్టర్లతో ర్యాలీ ( Tractors Rally ) నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నెల 8వ తేదీన మరో దఫా చర్చలు జరిపేందుకు రైతు సంఘ నేతలు సిద్ధమవుతున్నారు. 


Also read: Covishield vaccine price: వ్యాక్సిన్ డోసు ఒక్కటీ..వేయి రూపాయలు