Milind Soman: జోష్‌లో న్యూడ్‌గా పరిగెత్తాడు.. కేసు నమోదైంది
అతనో మోడల్, నటుడు.. పుట్టిన రోజు సందర్భంగా ఫుల్ జోష్‌లో.. బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. ఆపై ఫొటోలను సోషల్ మీడియా సైట్లల్లో షేర్ చేశాడు. కట్ చేస్తే గోవా పోలీసులు అతనిపై కేసునమోదు చేశారు.
FIR filed against Milind Soman for running naked on Goa beach: న్యూఢిల్లీ: అతనో మోడల్, నటుడు.. పుట్టిన రోజు సందర్భంగా ఫుల్ జోష్‌లో.. బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. ఆపై ఫొటోలను సోషల్ మీడియా సైట్లల్లో షేర్ చేశాడు. కట్ చేస్తే గోవా (Goa) పోలీసులు అతనిపై కేసునమోదు చేశారు. ప్రముఖ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ (Milind Soman) నవంబర్ 4న తన 55వ పుట్టిన రోజు సందర్భంగా (Milind Soman Birthday) బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. ఈ దృశ్యాన్ని ఆయన భార్య అంకితా కొన్వర్ తన కెమెరాలో బంధించింది. అయితే తన న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో షేర్ చేశాడు మిలిద్ సోమన్. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్ డే టు మీ.. 55 అండ్ రన్నింగ్ అంటూ తనకు తానే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇన్‌స్టా, ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది. Also read: Kajal, Gautam latest pics: న్యూ ఫొటోషూట్‌లో తళుక్కుమన్న కొత్త జంట
ఈ మేరకు గోవా పోలీసులు (Goa Police) శుక్రవారం మిలింద్‌పై కేసు నమోదు చేశారు. గో సూరక్ష మంచ్ అనే సంస్థ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మిలింద్‌పై ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఐపీసీ సెక్షన్ 294 కింద కొల్వా పోలీస్ స్టేషన్‌లో (FIR) కేసు నమోదు చేశారు. Also read: Baba ka Dhaba donation controversy: యూట్యూబర్‌పై చీటింగ్ కేసు
కాగా మోడల్ సంచలనం మిలింద్ సోమన్‌కు వివాదాలు కొత్తేమీకాదు. 1995లో బాలీవుడ్ నటి మధు సాప్రేతో కలిసి చేసిన కండోమ్ యాడ్ పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. ఇటీవల ఇలాంటి ఫోటోషూట్ పాల్గొన్న మోడల్ నటి పూనం పాండే, ఆమె భర్తపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. Also read: Bihar Assembly Election 2020: బీహార్ తుది దశ పోలింగ్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe