కరోనా వైరస్ ( Corona vaccine ) కు వ్యాక్సిన్ ఒక్కటే కన్పించే పరిష్కారం. ప్రపంచవ్యాప్తంగా ఐదే ఐదు వ్యాక్సిన్లు మూడోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. మరి ఇండియాకు అందే తొలి వ్యాక్సిన్ ఏదవుతుందనే విషయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారి ( Covid19 virus ) ఇంకా విజృంభిస్తూనే ఉంది. వ్యాక్సిన్ ఒక్కటే దీనికి పరిష్కారం. ప్రపంచంలో చాలా కంపెనీలు వ్యాక్సిన్ ( Vaccine ) అభివృద్ధిలో ఉన్నాయి. రష్యా ( Russia ) ఇప్పటికే రేసులో ముందంజలో ఉన్నానని ప్రకటించుకుంది. ఇక కీలకమైన మూడోదశ ప్రయోగాల్లో ఉన్నది ప్రపంచవ్యాప్తంగా మూడోదశ ప్రయోగాల్లో ఉన్నది కేవలం ఐదు కంపెనీలు. ఇందులో ప్రధానంగా విన్పిస్తున్నది ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-Astrazeneca ) , మోడెర్నా వ్యాక్సిన్ ( Moderna ) , ఫైజర్-బయోన్టెక్ ( Pfizer biontech ) వ్యాక్సిన్ లు. ఈ అన్ని కంపెనీల్లో సత్ఫలితాలనిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భావిస్తున్నది..అందరూ ఆశలు పెట్టుకున్నది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పైనే. Also read: Corona vaccine: అక్కడ వ్యాక్సిన్ ఉచితం, కంపెనీతో ఒప్పందం


ఇటు ఇండియా కూడా ఈ వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకుంది. దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాగ్జిన్ ( Covaxin ) ,  జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న జైకోవ్ డి వ్యాక్సిన్ లు 1-2 దశల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండియాకు చేరే తొలి వ్యాక్సిన్ కచ్చితంగా ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ ( Covishield ) మాత్రమే అనడంలో ఏ మాత్రం సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసి సరఫరా చేసే ఒప్పందం ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum instistute of india ) తో జరిగింది. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. మరోవైపు ఉత్తత్తి చేసే వ్యాక్సిన్ లో 50 శాతం దేశానికే కేటాయిస్తామని కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా ప్రకటించింది. 


అందుకే మొత్తం దేశం ఆశలు ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉన్నాయి. సెప్టెంబర్ నాటికి మూడోదశ పూర్తి చేసుకుని...డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులో తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. Also read: Rajiv Gandhi Jayanti: రాజీవ్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళి