HD Devegowda COVID-19 Positive: గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల నుంచే 80 శాతం కోవిడ్-19 పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవేగౌడ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవేగౌడతో పాటు ఆయన భార్యకు సైతం కరోనా సోకింది. ‘నా భార్య చెన్నమ్మకు, నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం మేం ఐసోలేషన్‌లో ఉన్నాం. డాక్టర్ల సలహాలు పాటిస్తున్నాం. గత కొన్ని రోజులుగా నన్ను నేరుగా కలుసుకున్నవారు కోవిడ్-19(COVID-19) నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. పార్టీ కార్యకర్తలు, నేతలు ధైర్యంగా ఉండాలని, అధైర్య పడవద్దని సూచిస్తూ’ దేవేగౌడ ట్వీట్ చేశారు.


Also Read: YSR Bima Amount: వైఎస్సార్ భీమా లబ్దిదారులకు శుభవార్త.. రూ.254 కోట్లు విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్



మాజీ ప్రధాని దేవేగౌడ కరోనా బారిన పడ్డారని విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆయనకు కాల్ చేశారు. దేవేగౌడ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెంగళూరులో ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలో కోలుకుంటానని ప్రధాని మోదీకి మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారు. తనను ఇటీవల కలిసిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook