YSR Bima Amount: వైఎస్సార్ భీమా లబ్దిదారులకు శుభవార్త.. రూ.254 కోట్లు విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

YSR Bima: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అయ్యేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు విడుదల చేశారు. బాధితులతో పాటు వారి కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 31, 2021, 02:00 PM IST
YSR Bima Amount: వైఎస్సార్ భీమా లబ్దిదారులకు శుభవార్త.. రూ.254 కోట్లు విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

YSR Bima Amount: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అయ్యేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు విడుదల చేశారు. బాధితులతో పాటు వారి కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నారు.

కుటుంబ పెద్దను కోల్పోయినన కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకమే వైఎస్సార్ భీమా. ప్రమాదవశాత్తూ చనిపోయినా, లేదా ప్రమాదం అనంతరం శాశ్వత అంగవైక్యలానిక దారి తీసినా అటువంటి వారి కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు బుధవారం నాడు లబ్దిదారులకు రూ.254 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan reddy) విడుదల చేశారు. అర్హులైన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ అవుతుందని పేర్కొన్నారు. 

గతంలో పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై పథకాల్లా 50 శాతం వాటా లేకున్నా ఏపీ ప్రభుత్వమే(AP Govt) వైఎస్సార్ భీమాను అమలు చేస్తోంది. అధికారులు సర్వే చేపట్టిన సమయంలో అర్హులుకాని వారు, అనంతరం కాలంలో అర్హులుగా మారిన వారి కుటుంబాలకు సైతం వైఎస్సార్ భీమాను అందజేయాలని మానవతాదృక్పథంతో వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సహజ మరణం చెందిన కుటుంబానికి YSR Bima రూ.2 లక్షలు అందజేశారు. 

ప్రమాదం వల్ల మరణం సంభవించినా, దాని కారణంగా శాశ్వత అంగవైకల్యం బారిన పడితే వారి వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నట్లయితే రూ.5 లక్షల మేర వైఎస్సార్ భీమా పథకం కింద లబ్ది చేకూరుస్తున్నారు. శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన వారి వయసు 51 నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలో ఉంటే రూ.3 లక్సలు, ప్రమాదం ద్వారా పాక్షిక అంగకవైకల్యానికి లోనై తమ పనులు చేసుకోలేకపోతున్న వారికి సైతం రూ.1.5 లక్షల భీమా సొమ్మును ఏపీ సీఎం వైఎస్ జగన్ అందజేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News