Assembly elections: దేశంలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఊహించిన సమయం కంటే ముందే వచ్చేట్టున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దిశగా సంకేతాలివ్వడమే దీనికి కారణం. ఇంతకీ ప్రధాని మోదీ ఏమన్నారు అసెంబ్లీ ఎన్నికల గురించి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ( Four state assembly elections) వాస్తవానికి 2-3 నెలల వ్యవధిలో జరుగుతాయని అందరూ ఆశిస్తున్నారు. అయితే అంచనాలకు భిన్నంగా ముందే వచ్చేట్టు కన్పిస్తున్నాయి. మార్చ్ 7వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ( Pm narendra modi) ఈ దిశగా సంకేతాలివ్వడమే దీనికి కారణం. అస్సోంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో  ప్రధాని అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యానించారు. 2016 ఎన్నికలు కూడా మార్చ్ 7న ప్రకటించారని..ఇప్పుడు కూడా అదే విధంగా మార్చ 7వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని మోదీ తెలిపారు. ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరుగుతాయన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సోంలో నెల రోజుల వ్యవధిలో మోదీ మూడోసారి పర్యటిస్తున్నారు.  వారం రోజుల క్రితం జరిపిన పర్యటనలో 9 వేల 5 వందల కోట్ల విలువైన రోడ్లు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల్ని మోదీ ప్రారంభించారు. 


అస్సోం బహిరంగ సభ అనంతరం పశ్చిమబెంగాల్ హుగ్లీ ప్రాంతంలో నిర్వహించిన నిజమైన మార్పు ర్యాలీలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ( West Bengal )‌లో ఇప్పటికే బీజేపీ పరివర్తన్ యాత్ర చేపడుతోంది. ఈ యాత్రకు ముగింపుగా కోల్‌కత్తాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో మార్చ్ మొదటివారంలో భారీహ బహిరంగసభ జరగనుంది.  బీజేపీ ఈసారి పశ్చిమ బెంగాల్ పీఠంపై కన్నేసిన సంగతి తెలిసిందే. 


Also read: New coronavirus strain: ఆందోళన రేపుతున్న కొత్తరకం కరోనా స్ట్రెయిన్, ఆ మూడు రాష్ట్రాల్లో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook